Varun Sandesh Ninda Movie: రూట్ మార్చిన వరుణ్ సందేశ్ - “నింద” మిస్టరీ సాల్వ్ అయ్యేది ఎప్పుడంటే?
Varun Sandesh Ninda Movie: హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో నింద పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. నింద టైటిల్ పోస్టర్ ఇటీవల రిలీజైంది. ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం.
Varun Sandesh Ninda Movie: ఒకప్పుడు హ్యాట్రిక్ సక్సెస్‌లతో టాలీవుడ్ వరుణ్ సందేశ్ పేరు మారుమ్రోగింది. యూత్ ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత ఫ్లాపులు అతడి కెరీర్‌కు అడ్డంకిగా మారాయి. ప్రస్తుతం ఓ సక్సెస్‌తో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు చాలా రోజుల నుంచి వెయింటింగ్ చేస్తున్నాడు. కెరీర్‌లో ఎక్కువగా లవ్ స్టోరీస్ చేసిన వరుణ్ సందేశ్ తాజాగా తన రూట్ మార్చాడు. మిస్టరీ థ్రిల్లర్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీకి నింద అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
నింద టైటిల్ పోస్టర్...
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందుతోన్న నింద మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కథకు సంబంధించి పలు హింట్స్ ఇచ్చారు. ఊరి వాతావరణం, ఓ చీకటి, గుడిసె, కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి.. దుర్మార్గులను అంతం చేసేందుకు సిద్దంగా ఉన్నటువంటి న్యాయదేవత విగ్రహం కూడా పోస్టర్‌లో కనిపిస్తోంది.
నింద టైటిల్ కింద ఉన్న కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ కూడా ఆసక్తిని పంచుతోంది. తనపై పడిన నిందపై ఓ వ్యక్తి ఎలాంటి పోరాటం సాగించాడన్నది ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. కాండ్రకోట అనే ఊరి బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ మూవీ సాగనున్నట్లు సమాచారం
రియల్ ఇన్సిడెంట్స్‌తో...
యదార్థ సంఘటనల ఆధారంగా రాజేష్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నింద మూవీని నిర్మిస్తున్నారు. నింద మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.
ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులకు నింద మూవీని చూపించామని, చూసిన వారందరూ మంచి కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించారంటూ ప్రశంసలు కురిపించారని మేకర్స్ పేర్కొన్నారు.. నింద మూవీ త్వరలోనే థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.నింద మూవీలో వరుణ్ సందేశ్ సరసన అనీ హీరోయిన్‌గా నటిస్తోంది. భద్రం, ఛత్రపతి శేఖర్, తనికెళ్లభరణి, మైమ్ మధు కీలక పాత్రలు పోషించారు.
హ్యాపీడేస్‌తో...
హ్యాపడేస్ మూవీతో వరుణ్ సందేశ్ కెరీర్ ప్రారంభమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీలో మెయిన్ హీరోగా వరుణ్ సందేశ్ కనిపించాడు. 2007లో కేవలం కోటి రూపాయల బడ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజైన హ్యాపీడేస్ అప్పట్లో పది కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు లాభాల వర్షాన్ని కురిపించింది. ఈ శుక్రవారం (ఏప్రిల్ 19న) హ్యాపీడేస్ మూవీ థియేటర్లలో రీ రిలీజైంది.
హ్యాపీడేస్‌తో కమర్షియల్ హిట్ అందుకున్న వరుణ్ సందేశ్‌కు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. కొత్త బంగారు లోకం మినహా మిగిలిన సినిమాలేవి విజయాలుగా నిలవలేకపోయాయి. గత ఏడాది సందీప్ కిషన్ మైఖేల్‌లో నెగెటివ్ రోల్ చేశాడు వరుణ్ సందేశ్. ప్రస్తుతం తెలుగులో హీరోగా యద్భావమ్ తద్భావతి, కానిస్టేబుల్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు.
టాపిక్