Seetharam Sitralu: ఫ‌న్నీగా సీతారాం సిత్రాలు ట్రైల‌ర్ - ఆదిపురుష్ గ్రాఫిక్స్‌పై పంచ్ డైలాగ్స్‌-tollywood news seetharam sitralu trailer unveiled by director maruthi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Seetharam Sitralu: ఫ‌న్నీగా సీతారాం సిత్రాలు ట్రైల‌ర్ - ఆదిపురుష్ గ్రాఫిక్స్‌పై పంచ్ డైలాగ్స్‌

Seetharam Sitralu: ఫ‌న్నీగా సీతారాం సిత్రాలు ట్రైల‌ర్ - ఆదిపురుష్ గ్రాఫిక్స్‌పై పంచ్ డైలాగ్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 09, 2024 12:15 PM IST

Seetharam Sitralu: పెళ్లి వీసీఆర్ క్యాసెట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న సీతారాం సిత్రాలు మూవీ త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను డైరెక్ట‌ర్ మారుతి రిలీజ్ చేశాడు.

సీతారాం సిత్రాలు ట్రైల‌ర్‌
సీతారాం సిత్రాలు ట్రైల‌ర్‌

Seetharam Sitralu: కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో కూడిన చిన్న సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోన్నాయి. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి పాత రోజుల‌ను మ‌ళ్లీ సిల్వ‌ర్‌స్క్రీన్‌పై డైరెక్ట‌ర్స్ రీ క్రియేట్ చేస్తున్నారు. అల‌నాటి మ‌ధురానుభూతులు, జ్ఞాప‌కాల‌తో సినిమాలు చేస్తున్నారు. అలాంటి కాన్సెప్ట్‌తోనే సీతారాం సిత్రాలు సినిమాలు రాబోతున్న‌ది. ఈ సినిమాలో లక్ష్మణ్ , భ్రమరాంబిక, కిశోరి ధాత్రిక్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రొమాంటిక్ క్రైమ్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న సీతారాం సిత్రాలు సినిమాతో డి నాగ‌శ‌శిధ‌ర్‌రెడ్డి డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. పాత రోజులను గుర్తు చేస్తూ... పెళ్లి విసిఆర్ క్యాసెట్స్ పై అల్లిన కథతో సీతారాం చిత్రాలు మూవీ తెర‌కెక్కుతోంది.

సీతారాం సిత్రాలు ట్రైల‌ర్‌...

సీతారం సిత్రాలు సినిమా ట్రైల‌ర్‌ను ద‌ర్శ‌కుడు మారుతి రిలీజ్ చేశారు. పాత వీసీఆర్ క్యాసెట్స్ కొత్త‌వాటిగా మాడిఫై చేసే పాత్ర‌లో హీరో క‌నిపించాడు. వాడైతే పెళ్లి క్యాసెట్స్‌కు బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ వీఎఫ్ఎక్స్‌లు వేస్తున్నాడు...అదే నేను వాడి ద‌గ్గ‌ర‌కు వెళితే ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్‌లు నేర్చుకోవ‌చ్చు అనే డైలాగ్స్ ఫ‌న్నీగా ఉంది.

ఫ‌న్‌, రొమాన్స్‌, ల‌వ్ స్టోరీతో పాటు క్రైమ్ ఎలిమెంట్‌ను చూపించారు. ఓ మ‌ర్డ‌ర్ క్యాసెట్‌ను మిక్స్ చేసి హీరో చిక్కుల్లో ప‌డిన‌ట్లుగా చూపించారు. చివ‌ర‌లో పెళ్లిళ్ల కోసం ఫొటో గ్రాఫ‌ర్ ప‌డే తిప్ప‌ల‌ను గురించి సింగిల్‌ టేక్‌లో హీరో చెప్పిన లాంగ్ డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. బీజీఎమ్ ట్రైల‌ర్‌లో ఆక‌ట్టుకుంటోంది. నీ పేరు శివ క‌దా సీతారామ్ ఎవ‌రూ అనే డైలాగ్ హీరో క్యారెక్ట‌ర్‌పై క్యూరియాసిటీని క‌లిగిస్తోంది.

ట్రైల‌ర్ బాగుంది....

మారుతి మాట్లాడుతూ...కొత్త కథ, కథనాలు ఉన్న సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకాదరణ పొందుతాయ‌న్నారు. సీతారాం చిత్రాలు టైటిల్, ట్రైలర్, బాగున్నాయ‌ని తెలిపాడు. సినిమా విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నానన్నారు .

ఫ‌స్ట్ మూవీ...

వీసీఆర్ క్యాసెట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో వ‌స్తోన్న ఫ‌స్ట్ మూవీ ఇదేన‌ని డైరెక్ట‌ర్ తెలిపాడు. ఫ‌స్ట్ సీన్ నుంచి చివ‌రి వ‌ర‌కు ఈ సినిమా న‌వ్విస్తూనే థ్రిల్‌ను పంచుతుంద‌ని చెప్పాడు. హీరోతో పాటు చాలా మంది న‌టులు కొత్త‌వాళ్లే అయినా అనుభ‌వ‌జ్ఞులుగా న‌టించార‌ని అన్నాడు. చిన్న సినిమానే అయినా ప్రొడ‌క్ష‌న్‌లో ఎక్క‌వ రాజీ ప‌డ‌లేద‌ని చెప్పారు.

త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో...

సీతారం సిత్రాలు షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్త‌య్యాయి. త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది. రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో ఢిల్లీ రాజేశ్వ‌రి, కృష్ణ‌మూర్తి కీల‌క పాత్ర‌లు పోషించారు. రుద్ర‌కిర‌ణ్ మ్యూజిక్ అందించాడు. పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి, కృష్ణ చంద్ర విజయభట్టు ప్రొడ్యూస‌ర్లుగా వ్య‌వ‌హ‌రించారు. హీరోయిన్ కిషోర్ ధాత్ర‌క్ తెలుగులో కొర‌మీనుతో పాటు మ‌రికొన్ని చిన్న సినిమాలు చేసింది.

టాపిక్