The 100 Movie: హీరోగా మొగ‌లి రేకులు సాగ‌ర్ రీఎంట్రీ - ఐపీఎస్ ఆఫీస‌ర్ క‌థ‌తో ది 100 మూవీ-tollywood news mogalirekulu sagar the 100 movie first look and motion poster unveiled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tollywood News Mogalirekulu Sagar The 100 Movie First Look And Motion Poster Unveiled

The 100 Movie: హీరోగా మొగ‌లి రేకులు సాగ‌ర్ రీఎంట్రీ - ఐపీఎస్ ఆఫీస‌ర్ క‌థ‌తో ది 100 మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Mar 15, 2024 06:11 AM IST

The 100 Movie: మొగ‌లి రేకులు సాగ‌ర్ హీరోగా న‌టిస్తోన్న ది 100 మూవీ ఫ‌స్ట్ లుక్‌ను మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విక్రాంత్ అనే ఐపీఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సాగ‌ర్ న‌టిస్తున్నాడు.

ది 100 మూవీ
ది 100 మూవీ

The 100 Movie: మొగ‌లి రేకులు సీరియ‌ల్ ఫేమ్ సాగ‌ర్ అలియాస్ ఆర్కేనాయుడు మూడేళ్ల త‌ర్వాత హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు. ది 100 పేరుతో ఓ యాక్ష‌న్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు లాంఛ్ చేశారు. ది 100 సినిమాకు రాఘ‌వ్ ఓంకార్ శ‌శిధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో సాగ‌ర్... విక్రాంత్ అనే ఐపీఎస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో పోలీస్ డ్రెస్‌లో గ‌న్ ప‌ట్టుకొనిఇంటెన్స్ లుక్‌లో సాగ‌ర్ క‌నిపిస్తున్నాడు. మోషన్ పోస్టర్ నెంబర్ 100 ప్రాముఖ్యతను వివ‌రిస్తూ ఆస‌క్తిని పంచుతోంది. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, ఇది ఒక ఆయుధం అనే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది.

మంచి సోష‌ల్ మెసేజ్‌...

మోషన్ పోస్టర్‌ లాంచింగ్ ఈవెంట్‌లో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సినిమా అనేది శక్తివంతమైన ఆయుధం. సినిమా ప్రభావం సమాజంపై చాలా వుంటుంది. 'ది 100స సినిమా క‌థ‌ చాలా బావుంది. ది 100 సినిమాతో నటుడిగా సాగర్ మంచి పేరు తెచ్చుకుంటార‌నే న‌మ్మ‌క‌ముంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్ర‌తి పోలీస్ అధికారి సాగర్ లానే వుండాలానే అభిప్రాయం కలుగుతుంది. సినిమాలో వున్న సందేశం నాకు చాలా నచ్చింది. సినిమా ఎప్పుడూ సందేశాన్ని అందించాలి. ఆ సందేశం మంచిదైతే ప్రేక్షకులు ఇంకా ఎక్కువ ఆదరిస్తారు'' అన్నారు.

ఫ్యామిలీ మూవీ...

హీరో ఆర్కే సాగర్‌ మాట్లాడుతూ.. ఒక సినిమా చేస్తే సంతోషం కాదు గర్వం వుంటుంది. అలాంటి గౌరవాన్ని ఇచ్చిన సినిమా ఇది 'ది 100' అనేది ప్రతి మనిషి జీవితానికి అవ‌స‌ర‌మైన ఓ ఆయుధం అనే కాన్సెప్ట్‌తో తెర‌కెక్కించాం. ఇది ఫ్యామిలీ మూవీ. కుటుంబ ప్రేక్ష‌కులంద‌రూ సినిమా చుస్తారనే నమ్మకం వుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మంచి నేపధ్య సంగీతం ఇచ్చారు అని తెలిపాడు.

ది 100 ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అని డైరెక్ట‌ర్ ఓంకార్ రాఘ‌వ్ అన్నాడు. సహజంగా ఉంటూనే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక సోషల్ ఇష్యూని చెప్పడం జరిగింద‌ని తెలిపాడు. అందరూ చూడదగ్గ సినిమా అవుతుంద‌ని పేర్కొన్నాడు.

మిషా నారంగ్ హీరోయిన్‌...

ది 100 మూవీలో మిషా నారంగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ధన్య బాలకృష్ణణ్ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు యానిమ‌ల్ ఫేమ్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొగ‌లి రేకులు సీరియ‌ల్‌తో సాగ‌ర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యాడు. ఈ సీరియ‌ల్‌లో ఆర్కేనాయుడు అనే పాత్ర‌కు నంది అవార్డును అందుకున్నాడు.

ఈ స్క్రీన్ నేమ్‌తోనే పాపుల‌ర‌య్యాడు. మొగ‌లిరేకులుతో పాటు చ‌క్ర‌వాకం కూడా సాగ‌ర్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. సీరియ‌ల్స్ ద్వారా వ‌చ్చిన పేరుతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాగ‌ర్ .... సిద్ధార్థ‌, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు షాదీ ముబార‌క్ అనే సినిమాలు చేశాడు. వీటిలో షాదీ ముబార‌క్ మంచి స‌క్సెస్‌ను సాధించింది. మ‌న‌సంతా నువ్వే, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ సినిమాల్లో సాగ‌ర్ చిన్న రోల్స్ చేశాడు.

IPL_Entry_Point

టాపిక్