Jithender Reddy Mangli Song: జితేందర్‌రెడ్డి నుంచి తెలంగాణ సాంగ్ రిలీజ్ - మంగ్లీ వాయిస్ హైలైట్
Jithender Reddy Mangli Song: జితేందర్‌రెడ్డి మూవీ నుంచి సింగర్ మంగ్లీ పాడిన ఓ హుషారైన పాటను రిలీజ్ చేశారు. తెలంగాణ పదాలతో పెళ్లి నేపథ్యంలో వచ్చే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

లచ్చిమక్క అచ్చెనక్క పిల్లాను సూడండే అనే లిరిక్స్‌తో మొదలైన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. మంగ్లీ వాయిస్ ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పెళ్లి తాలుకు సరదాలు, సందళ్లను ఈ పాటలో సహజంగా ఆవిష్కరించారు.
ఇద్దరు హీరోయిన్లు...
జితేందర్‌రెడ్డి మూవీలో వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవిప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముదిగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తూ కథను అందిస్తున్నాడు. ఇటీవల జితేందర్‌రెడ్డి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ తో పాటు అ ఆ ఇ ఈ ఉ ఊ సాంగ్ రిలీజ్ చేశారు.
విరించి వర్మ రీఎంట్రీ...
1980ల కాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా జితేందర్‌రెడ్డి మూవీని దర్శకుడు విరించి వర్మ తెరకెక్కిస్తోన్నారు. నాని మజ్ను హిట్ తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న విరించి వర్మ జితేందర్‌రెడ్డి తిరిగి మెగాఫోన్ పట్టాడు. గత సినిమాలకు భిన్నంగా పొలిటికల్ అంశాలతో ఈ మూవీని తెరకెక్కిస్తోన్నాడు.
జగిత్యాల లీడర్...
పేద ప్రజల కోసం పోరాటం చేసిన జగిత్యాలకు చెందిన జితేందర్‌రెడ్డి జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. 1980 కాలం నాటి తెలంగాణ సామాజిక పరిస్థితులను ఈ సినిమా కోసం సహజంగా రీక్రియేట్ చేస్తోన్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం వస్తున్న కథలకి పూర్తి భిన్నంగా జితేందర్‌రెడ్డి ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.మే 3న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
ఎవరికి చెప్పొద్దుతో హీరో...
బాహుబలి, గూఢచారితో పాటు తెలుగులో పలు సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ చేశాడు రాకేష్ వర్రే, ఎవరికి చెప్పొద్దు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సెన్సిటివ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది.
మరోవైపు ఉయ్యాల జంపాల మూవీతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు విరించి వర్మ. రాజ్‌తరుణ్, అవికాగోర్ జంటగా నటించిన ఈ లవ్‌స్టోరీ మూవీ కమర్షయల్ సక్సెస్‌గా నిలిచింది. ఆ తర్వాత నానితో మజ్ను సినిమా చేశాడు. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లయినా దర్శకుడిగా రెండు సినిమాలు మాత్రమే చేశాడు విరించి వర్మ.
టాపిక్