Indrani Trailer: వందేళ్ల త‌ర్వాత ఇండియా ఎలా ఉంటుందో చూపించాం - ఇంద్రాణి మూవీపై డైరెక్ట‌ర్ కామెంట్స్‌-tollywood news indias first superwoman movie indrani hits the screens on june 14th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Indrani Trailer: వందేళ్ల త‌ర్వాత ఇండియా ఎలా ఉంటుందో చూపించాం - ఇంద్రాణి మూవీపై డైరెక్ట‌ర్ కామెంట్స్‌

Indrani Trailer: వందేళ్ల త‌ర్వాత ఇండియా ఎలా ఉంటుందో చూపించాం - ఇంద్రాణి మూవీపై డైరెక్ట‌ర్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Jun 03, 2024 02:04 PM IST

Indrani Trailer: సూప‌ర్ ఉమెన్ మూవీ కాన్పెప్ట్‌తో తెర‌కెక్కిన తెలుగు మూవీ ఇంద్రాణి జూన్ 14న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో యానీయా, అంకిత‌, క‌బీర్‌సింగ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఇంద్రాణి మూవీ
ఇంద్రాణి మూవీ

Indrani Trailer: యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న ఇంద్రాణి మూవీ ట్రైల‌ర్ ఆదివారం రిలీజైంది. ఉమెన్ విమ‌న్ మూవీ కాన్సెప్ట్‌తో స్టీఫెన్ ప‌ల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిస్తోన్నాడు. ఇంద్రాణి మూవీ జూన్ 14న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది

వాయిస్ ఓవ‌ర్‌తో...

సాయికుమార్ వాయిస్ ఓవ‌ర్‌తో ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌ను క‌లిగిస్తోంది. అంత‌ర్జాతీయ శాంతి భ‌ద్ర‌త‌ల కోసం భార‌త్ ఇండియ‌న్ సూప‌ర్ ఫోర్స్ అనే సంస్థ స్థాపించ‌డం అనే పాయింట్‌తో ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఇండియాపై శ‌త్రువుల చేసిన దాడుల‌ను ఇండియ‌న్ సూప‌ర్ హీరో ఎలా ఎదుర్కొనే అంశాల‌ను ఈ ట్రైల‌ర్‌లో చూపించారు. ట్రైల‌ర్‌లోని విజువ‌ల్స్‌, యాక్ష‌న్ సీన్స్ ఆస‌క్తిని పంచుతున్నాయి.

రోబో లీడ్ రోల్‌...

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ స్టీఫెన్ పల్లం మాట్లాడుతూ...ఇంద్రాణి ఓ విజువ‌ల్ వండ‌ర్‌లా ఉంటుంది. అద్భుత‌మైన క‌థ‌, క‌థ‌నాలు, వీఎఫ్ఎక్స్ హంగుల‌తో ఈ మూవీ మెప్పిస్తుంది. ఇందులో ఓ లీడ్ రోల్ తో పాటు ఒక రోబోని కూడా క్రియేట్ చేశాం. ఆ ఇద్దరి జర్నీ చాలా అద్భుతంగా వుంటుంది.

ఈ యాక్ష‌న్ మూవీలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా వుంది. వందేళ్ళ తర్వాత టెక్నాలజీ ప‌రంగా వ‌చ్చే మార్పులేమిటి? ప్రపంచంలో భార‌త అగ్ర గామిగా ఎలా మార‌బోతుంది అనే అంశాల‌ను ఈ మూవీలో చూపించ‌బోతున్నా.యానీయా ఇండియన్ సూపర్ విమన్ గా అద్భుతంగా నటించింది. ఇంద్రాణి మాస్ మార్వెల్ మూవీ. హాలీవుడ్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే తెలుగు ఆడియెన్స్‌ను ఈ మూవీ మెప్పిస్తుంది అని తెలిపాడు.

సూప‌ర్ విల‌న్‌...

న‌టుడు కబీర్ సింగ్ మాట్లాడుతూ..ఇండియాలో చాలా సూపర్ హీరో సినిమాలు వచ్చాయి. కానీ ఇంద్రాణి ఫస్ట్ ఇండియన్ సూపర్ ఉమెన్ మూవీగా ఇంద్రాణి రాబోతుంది. . ఇందులో సూపర్ విలన్ పాత్ర‌ను నేను చేశాయి. ఫ్యామిలీతో కలసి హాయిగా చూసే సినిమా ఇది. యూనిక్ కాన్సెప్ట్‌తో ఆక‌ట్టుకుంది.అని అన్నాడు.

నెక్స్ట్ లెవెల్ విజువ‌ల్స్‌...

మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ మాట్లాడుతూ.. ఇంద్రాణి లో నెక్స్ట్ లెవల్ విజువల్స్ వుంటాయి. సిజీ వర్క్ అద్భుతంగా వుంది. సాంగ్స్ చాలా డిఫరెంట్ గా చేశాం. ఫస్ట్ ఇండియన్ సూపర్ విమన్ సినిమాగా వస్తున్న ఇంద్రాణి పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది అని చెప్పాడు.

లార్జ‌ర్ దేన్ లైఫ్‌

కో ప్రొడ్యూసర్ జే సేన్ మాట్లాడుతూ.. దర్శకుడు స్టీఫెన్ ఈ సినిమాని చాలా ఫ్యూచరిస్టిక్ గా తీశాడు. సూపర్ విమన్ క్యారెక్టర్, విజువ‌లైజేషన్ ఫ్యాన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌ను అందిస్తాయి. ఈ సినిమా కోసం స్టీఫెన్ క్రియేట్ చేసిన వరల్డ్ అద్భుతంగా వుంటుంది. ఇంద్రాణి' లార్జర్ దేన్ లైఫ్ ఎంటర్ టైనర్ మౌత్ టాక్‌తోనే అద్భుతమైన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను'' అన్నారు. యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్ ఇంద్రాణి మూవీలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్