Pranaya Godari Movie: కమెడియన్ ఆలీ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో ఎంట్రీ - రా అండ్ రస్టిక్‌గా ప్రణయ గోదారి ఫస్ట్ లుక్
Pranaya Godari Movie: టాలీవుడ్ కమెడియన్ ఆలీ ఫ్యామిలీ నుంచి ఆయన సోదరుడి కుమారుడు సదన్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ప్రణయ గోదారి పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
Pranaya Godari Movie: వారసులు హీరోలుగా మారడం టాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. మహేష్‌బాబు, రామ్‌చరణ్, ఎన్టీఆర్ తో పాటు పలువురు కథానాయకులుగా వారసత్వంతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్స్‌గా మారారు. తాజాగా మరో వారసుడు టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు.
అలీ ఫ్యామిలీ నుంచి...
టాలీవుడ్ కమెడియన్ అలీ ఇంటి నుంచి సదన్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. . సదన్ , ప్రియాంక ప్రసాద్ హీరోహీరోయిన్లుగా ప్రణయగోదారి పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహిస్తోన్నాడు. పారమళ్ళ లింగయ్య ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.
ప్రణయ గోదారి ఫస్ట్ లుక్‌ను అంబర్ పేట్ శంకర్ రిలీజ్ చేశాడు. ఆవిష్కరించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. గోదారి మధ్యలో ఓ సైకిల్ నిలిపి ఉంది. ఆ సైకిల్‌కు గాలంతో పాటు చేపల బుట్ట వేలాడదీసి ఉన్నాయి.
చిన్న సినిమాకు అండగా నిలవాలి...
ఈ సందర్భంగా అంబర్ పేట్ శంకర్ మాట్లాడుతూ.. చిన్న చిత్రాలకు సినీ పరిశ్రమలోని అందరూ అండగా నిలువాలి. చిన్న సినిమా అయినప్పటికీ మంచి కంటెంట్ తో వస్తున్న ప్రణయ గోదారి మంచి సక్సెస్‌తో పాటు నిర్మాతకు డబ్బులు తెచ్చిపెట్టాలి అని అన్నాడు. కూడా రావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని అన్నారు.. ప్రణయ గోదారి మూవీ షూటింగ్ పూర్తయిందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ లవ్ స్టోరీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
అలీ సోదరుడి కుమారుడు...
అలీ సోదరుడి కుమారుడు సదన్ కు హీరోగా ఇదే ఫస్ట్ మూవీ. హీరోయిన్ ప్రియాంక ప్రసాద్ కూడా ప్రణయగోదారితోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే అందమైన ప్రేమకథ ఇదని సమాచారం. రా అండ్ రస్టిక్‌గా ఉండబోతున్నట్లు మేకర్స్ చెబుతోన్నారు.
ప్రణయగోదారి సినిమాలో సాయికుమార్, 30 ఇయర్స్ పృథ్వి, జబర్దస్త్ రాజమౌళి, కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రణయ గోదారి సినిమాకు మార్కాండేయ సంగీత దర్శకుడిగా.. ఈదర ప్రసాద్ కెమెరామెన్‌గా వ్యవహరించారు.
అలీ, ఖయ్యూమ్...
టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌లలో ఒకరిగా పేరుతెచ్చుకున్నాడు అలీ. కమెడియన్‌గానే కాకుండా హీరోగా యమలీల, పిట్టలదొరతో పాటు పలు కామెడీ సినిమాలు చేసి విజయాలను అందుకున్నాడు. అలీ గత కొన్నాళ్లుగా సినిమాల వేగాన్ని తగ్గించాడు అలీ.
ఈ ఏడాది అలీ నటించిన గీతాంజలి మళ్లీ వచ్చింది మాత్రమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అలీ తర్వాత అతడి సోదరుడు ఖయ్యూమ్ కూడా తెలుగులో చాలా సినిమాల్లో కమెడియన్‌గా కనిపించాడు. కొన్ని చిన్న సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ అలీ స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయాడు.
టాపిక్