HanuMan Box Office Collection Day 2: ప్రశాంత్ వర్మ సినిమా మొదటి శనివారం కలెక్షన్లు 55 శాతం జంప్
HanuMan Box Office Collection Day 2: తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హనుమాన్'.
హనుమాన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 2: తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన హనుమాన్ చిత్రం రెండవ రోజు బాక్సాఫీస్ కలెక్షన్లలో 55.65% పెరుగుదల కనబరిచింది. తొలి శనివారం ఈ చిత్రం రూ. 12.53 కోట్లు వసూలు చేసింది. ఇందులో తెలుగు వెర్షన్ నుంచి రూ. 8.4 కోట్లు, హిందీ వెర్షన్ నుంచి రూ. 4.13 కోట్లు వచ్చాయి. ఇండియాలో రూ. 14.05 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 9.45 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.23.5 కోట్లు కలెక్ట్ చేసింది.
తెలుగులో తొలి సూపర్ హీరో మూవీగా పేరుగాంచిన హనుమాన్ విడుదలకు ముందే ఊపందుకుంది. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ గురువారం రూ. 4.15 కోట్లు రాబట్టింది. విడుదలైన రోజే ఈ సినిమా రూ. 8.05 కోట్లు రాబట్టింది. తెలుగు వెర్షన్ రూ. 5.89 కోట్లు రాబట్టగా, హిందీ వెర్షన్ రూ.2.1 కోట్లు రాబట్టింది.
ఈ చిత్రంలో హనుమంతు అనే కథానాయకుడిగా తేజ సజ్జా నటించారు. అతను అంజనాద్రి అనే ఊహాజనిత ప్రదేశానికి చెందినవాడు. అతను హిందూ దేవుడైన హనుమంతు యొక్క మానవాతీత శక్తులను పొంది తన ప్రజల కోసం పోరాడుతాడు.ఈ చిత్రంలో హనుమంతు అక్క అంజమ్మగా వరలక్ష్మి శరత్ కుమార్, హనుమంతు ప్రేయసి మీనాక్షి పాత్రలో అమృతా అయ్యర్ నటించారు.
జాంబీ రెడ్డికి రచన, దర్శకత్వం వహించిన వర్మకు మంచి పేరుంది. ఈ జాంబీ కామెడీలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఆనంది, దక్ష నాగర్కర్ కూడా నటించారు.
ఈ చిత్రం రూ. 4 కోట్లతో నిర్మితమైంది. ఈ చిత్రం సుమారు రూ .11 కోట్లు సంపాదించిందని సక్నిల్క్ తెలిపింది. ఒరిజినల్ మూవీకి సీక్వెల్ గా జాంబీ రెడ్డి: రివెంజ్ ఆఫ్ ది డెడ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
కాగా హనుమాన్ మూవీ ప్రదర్శన కోసం ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లు దాన్ని ఉల్లంఘించి తమ చిత్రాన్ని ప్రదర్శించడం లేదని మైత్రీ మూవీ మేకర్స్ ఆరోపించింది. దీనిపై నిరంజన్ రెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయగా, అగ్రిమెంట్లను థియేటర్లు ఉల్లంఘించడం సరికాదని నిర్మాతల మండలి పేర్కొంది.
డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. అగ్రిమెంట్లలో ఉన్న నియమాల ప్రకారం థియేటర్లలో హనుమాన్ చిత్రాన్ని ప్రదర్శించాలని, అలాగే జరిగిన నష్టాన్ని కూడా భరించాలని ఆదేశించింది. అగ్రిమెంట్లను ఉల్లంఘించడం తెలుగు సినీ పరిశ్రమకు మంచిది కాదని నిర్మాతల మండలి పేర్కొంది.
Disclosure: Numbers have been sourced from Sacnilk