Kalingaraju Movie: కళింగరాజు ఫస్ట్ లుక్ రిలీజ్ - మాస్ రోల్‌లో ఆశీష్ గాంధీ
Kalingaraju Movie:ఆశీష్ గాంధీ హీరోగా కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీకి కళింగరాజు అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బుధవారం రిలీజ్ చేశారు.
Kalingaraju Movie: ఆశీష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగణ కాంబినేషన్‌లో గతంలో నాటకం మూవీ రూపొందింది. కొంత విరామం తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి మరో మూవీ చేయబోతున్నారు. ఈ సినిమాకు కళింగరాజు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌నుబుధవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మాస్ లుక్‌లో ఆశీష్ గాంధీ కనిపిస్తోన్నాడు. అతడి చేతిలో కత్తి కనిపిస్తోంది. హీరో వెనుక గేదేలు, పక్కన పాల క్యాన్ కనిపించడం ఆసక్తిని పంచుతోంది. అస్తమిస్తున్న సూర్యుడు ఉండటం ఆకట్టుకుంటోంది.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో...
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ రివేంజ్ డ్రామా కళింగరాజు సినిమా తెరకెక్కుతోన్నట్లు సమాచారం. రా అండ్ రస్టిక్‌గా ఉండబోతున్నట్లు చెబుతోన్నారు. ఇందులో మాస్ రోల్‌లో ఆశీష్ గాంధీ కనిపించబోతున్నాడు ఇప్పటివరకు తెలుగు తెరపై రాని ఓ యూనిక్ పాయింట్‌తో ఈ మూవీ రూపొందినట్లు చెబుతోన్నారు. . హీరోగా ఆశీష్ గాంధీకి మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. రిజ్వాన్, శ్రీ సాయి దీప్ చాట్ల కళింగరాజు మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. హీరోయిన్‌తో పాటు మిగిలిన నటీనటుల ఎంపిక జరుగుతోన్నట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి త్వరలోనే కళింగరాజు రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు.
సురేష్ బొబ్బలి మ్యూజిక్...
కళింగరాజు సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. 90s వెబ్ సిరీస్ తర్వాత సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తోన్న మూవీ ఇది. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.గరుడవేగ అంజి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం. రాకేందు మౌళి పాటలు రచించారు.
రుద్రంగిలో…
తెలుగులో హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, రుద్రంగి, ఉనికి, డైరెక్టర్‌తో పాటు చాలా సినిమాలు చేశాడు ఆశీష్ గాంధీ. రుద్రంగి మల్లేషం అనే పల్లెటూరి యువకుడిగా కనిపించాడు. నాటకం సినిమా ఆశీష్ గాంధీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో వచ్చిన నాటకంలో కోటి అనే కుర్రాడిగా మాస్ రోల్ చేశాడు. హీరోగా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు ఆశీష్ గాంధీ.
తీస్ మార్ ఖాన్…
కళ్యాణ్ జీ గోగణ తెలుగులో నాటకం తర్వాత పూర్ణతో సుందరి సినిమా చేశాడు. లేడీ ఓరియెంటెడ్ మూవీ దర్శకుడిగా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆది సాయికుమార్ తీస్‌మార్‌ఖాన్, కాదల్ సినిమాలకు కళ్యాణ్ దర్శకత్వం వహించాడు.