Thaman: ఒకే వేదిక‌పై త‌మ‌న్, దేవిశ్రీప్ర‌సాద్ - క్రికెట్ టీమ్‌లో అఖిల్‌ అక్కినేని - నాట్స్ క‌ర్టెన్ రైజ‌ర్ రిలీజ్‌-tollywood music directors devi sri prasad and thaman will share stage for a music concert during the nats event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thaman: ఒకే వేదిక‌పై త‌మ‌న్, దేవిశ్రీప్ర‌సాద్ - క్రికెట్ టీమ్‌లో అఖిల్‌ అక్కినేని - నాట్స్ క‌ర్టెన్ రైజ‌ర్ రిలీజ్‌

Thaman: ఒకే వేదిక‌పై త‌మ‌న్, దేవిశ్రీప్ర‌సాద్ - క్రికెట్ టీమ్‌లో అఖిల్‌ అక్కినేని - నాట్స్ క‌ర్టెన్ రైజ‌ర్ రిలీజ్‌

Nelki Naresh HT Telugu

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు దేవిశ్రీప్ర‌సాద్‌,తమ‌న్ ఒకే వేదిక‌పై క‌లిసి క‌నిపించ‌బోతున్నారు. అమెరికాలో జూలైలో జ‌రుగ‌నున్న నాట్స్ తెలుగు సంబ‌రాలు ఈవెంట్‌లో త‌మ‌న్‌, దేవిశ్రీప్ర‌సాద్ క‌లిసి మ్యూజిక్ క‌న్స‌ర్ట్ చేయ‌నున్నారు. నాట్స్ క‌ర్టెన్ రైజ‌ర్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు.

నాట్స్ కర్టెన్ రైజర్ ఈవెంట్

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు దేవిశ్రీప్ర‌సాద్‌, త‌మ‌న్ ఒకే వేదిక‌పై క‌నిపించ‌బోతున్నారు. వీరిద్ద‌రు క‌లిసి అమెరికాలో ఓ మ్యూజిక్‌ క‌న్స‌ర్ట్ చేయ‌బోతున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) 8వ తెలుగు సంబరాలు జూలై 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అమెరికాలోని టంపాలో జరగనున్నాయి.

ఈ నాట్స్ సంబ‌రాల్లో దేవిశ్రీప్ర‌సాద్‌, త‌మ‌న్ క‌లిసి మ్యూజిక్ క‌న్స‌ర్ట్ చేయ‌నున్నారు. నాట్స్ క‌ర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్ర‌వారం జ‌రిగింది. ఈ కార్యక్రమంలో సినీ ప్ర‌ముఖులు జయసుధ, ఆమని, దర్శకులు హరీశ్ శంకర్, మెహర్ రమేష్, సంగీత దర్శకుడు తమన్, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్ పాల్గొన్నారు.

2009లో లాంఛ్‌...

నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని మాట్లాడుతూ "నాట్స్ అంటే సేవ, భాష ..ఈ రెండు పదాలు గుర్తుకువస్తాయి. అమెరికాలోని తెలుగు వారికి అండగా నిలబడేందుకు 2009లో ఈ ఆర్గనైజేషన్ ను స్థాపించాం. మనకు ఇక్కడ ఏదైనా ఆపద వస్తే స్నేహితులు, బంధువులు ఉంటారు. కానీ అమెరికాలో ఉన్న తెలుగువారికి ఎవరూ ఉండరు. వారికి ధైర్యాన్ని ఇస్తూ అండగా నిలబడుతోంది నాట్స్. మా సంస్థ 8వ తెలుగు సంబరాలు కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉంది.

ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు కవులు, కళాకారులు, నటీనటులు, ఇతర రంగాల ప్రముఖు హాజరుకాబోతున్నారు. తెలుగు భాష చాలా గొప్పది, అలాంటి భాషను కాపాడుకుంటూ మన సంస్కృతీ సంప్రదాయాలను ముందు తరాలకు అందిస్తూ వెళ్లాలనే ప్రయత్నం నాట్స్ ద్వారా చేస్తున్నాం" అన్నారు.

క్రికెట్ టోర్న‌మెంట్‌...

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ “నాట్స్ గత తెలుగు సంబరాలు ఈవెంట్ లో నేను పాల్గొన్నాను. ఇప్పుడు సెకండ్ టైమ్ వారికి కన్సర్ట్ చేయబోతున్నా. నాతో పాటు దేవిశ్రీ ప్రసాద్ కూడా కన్సర్ట్ లో పాల్గొంటాడు. సంగీత విభావరితో పాటు జూలై 1 నుంచి 3 తేదీలక్రికెట్ టోర్నమెంట్ ఆడబోతున్నాం. నాట్స్ 11 టీమ్ మేము మరో టీమ్ పోటీ పడుతున్నాం. అఖిల్, సుధీర్ బాబుతో ప‌లువురు టాలీవుడ్ హీరోలు ఈ క్రికెట్ ఆడ‌నున్నారు” అని అన్నాడు.

స‌పోర్ట్‌గా నిల‌బ‌డుతోంది...

దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ “తెలుగు భాషకు, మన సంస్కృతీ సంప్రదాయాలకు వీరి చేస్తున్న సేవ అద్భుతం. తెలుగు వారు ఎక్కడున్నా నాట్స్ వారిక‌ సపోర్ట్ గా నిలబడుతోంది. ఇలాంటి ఆర్గనైజేషన్ ఎంతో ముందుకు వెళ్లాలి. మరింతగా తెలుగు వారికి అండగా ఉండాలి” అని చెప్పారు.

తెలుగు భాషను కాపాడటమే కాదు ముందు తరాలకు అందేలా చూస్తున్నా నాట్స్ వారికి ధన్యవాదాలు. నాట్స్ తెలుగు సంబరాలు కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను. రామజోగయ్య గారితో కలిసి ఒక ప్రోగ్రాం చేస్తున్నాం” లిరిసిస్ట్ చంద్రబోస్ అన్నారు. నాట్స్ క‌ర్టెన్ రైజ‌ర్ ఈవెంట్‌లో శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని పాల్గొన్నారు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం