Double Engine OTT: ఓటీటీలోకి తెలంగాణ బ్యాక్‌డ్రాప్ మూవీ - ఆహాలో ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
Double Engine OTT: గాయత్రి గుప్తా ప్రధాన పాత్రలో నటిస్తోన్న డబుల్ ఇంజిన్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మార్చి 29 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Double Engine OTT: సినిమాల కంటే వివాదాలతో టాలీవుడ్‌లోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది గాయత్రి గుప్తా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తెలుగు మూవీ డబుల్ ఇంజిన్ ఓటీటీలోకి రాబోతోంది. మార్చి 29 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి రోహిత్ పెనుమాత్స దర్శకత్వం వహించాడు. రోహిత్, శశి కథను అందించారు.
30 లక్షల బడ్జెట్...
కేవలం 30 లక్షల బడ్జెట్‌తో 12 రోజుల్లోనే ప్రయోగాత్మకంగా డబుల్ ఇంజిన్ మూవీని తెరకెక్కించారు. డబుల్ ఇంజిన్ సినిమాలో ముని, అజిత్ కుమార్, రోహిత్ నరసింహ, రాజు తో గాయత్రి గుప్తా కీలక పాత్రలు పోషించారు. తెలంగాణ యాస, భాషలతో రియలిస్టిక్‌గా ఈ సినిమా రూపొందింది. డబుల్ ఇంజిన్ ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు.
రెండు తలల పాము...
యథార్థ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు రోహిత్ డబుల్ ఇంజిన్ మూవీని తెరకెక్కించాడు. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తోన్న డానీ తన చిన్ననాటి స్నేహితుడు గోపిని కలవడానికి ఓ పల్లెటూరికి వస్తాడు.రెండు తలల పామును అమ్మి భారీగా డబ్బు సంపాదించాలని డానీ, గోపి ప్లాన్ చేస్తారు? పామును పట్టుకునే ప్రయత్నంలో వారు ఎలాంటి కష్టాలు పడ్డారు? రెండు తలల పాము వారికి దొరికిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ. ఈ సినిమాలో గాయత్రి గుప్తా మినహా మిగిలిన వారందరూ కొత్త నటీనుటులే కావడం గమనార్హం.
జనవరి 5న థియేటర్లలో రిలీజ్...
జనవరి 5న డబుల్ ఇంజిన్ మూవీ థియేటర్లలో రిలీజైంది. గంట నలభై ఐదు నిమిషాల నిడివితోనే ఈ మూవీని తెరకెక్కించారు. తక్కువ థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. అదే రోజు పలు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీగా రిలీజ్ కావడం సినిమాను దెబ్బ కొట్టింది.
అమర్ అక్బర్ ఆంథోనీ...
ఫిదాలో సాయిపల్లవి స్నేహితురాలిగా కనిపించింది గాయత్రి గుప్తా. ఈ సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, అమర్ అక్బర్ ఆంథోనీ, బుర్రకథ, అన్‌స్టాపబుల్‌తో పాటు పలు సినిమాలు చేసింది.
దయా, షూటౌట్ ఎట్ ఆలేరు అనే తెలుగు వెబ్‌సిరీస్‌లలో వైవిధ్యమైన పాత్రలు చేసింది. ఈ సినిమాలేవి ఆమెకు ఆశించిన స్థాయిలో పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. ఒక చిన్న మాట అనే సిరీస్‌కు రైటర్, డైరెక్టర్‌గా గాయత్రి గుప్తా వ్యవహరించింది. మాస్క్ మ్యాన్ అనే మూవీకి రైటర్‌గా పనిచేసింది.
బిగ్‌బాస్‌పై ఆరోపణలు...
టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ అప్పట్లో ఆరోపణలు చేసింది గాయత్రి గుప్తా. బిగ్‌బాస్ షోపైగాయత్రి గుప్తా చేసిన కాంట్రవర్సీయల్ కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. బిగ్‌బాస్ ప్రతినిధులు తనతో అసభ్యంగా కామెంట్స్ చేశారని, కమిట్‌మెంట్ అడిగారని చెప్పింది.
బిగ్‌బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని కామెంట్స్ చేసింది. బిగ్‌బాస్ లో అవకాశం ఇస్తానని మాటివ్వడంతో తాను చాలా సినిమాల అవకాశాలు వదులుకున్నానని, చివరకు బిగ్‌బాస్ యాజమాన్యం తనను మోసం చేసిందని గాయత్రి గుప్తా అన్నది. బిగ్‌బాస్ షోపై కేసు పెట్టింది.