Ramajogaiah Sastry Tweet Viral: ఇబ్బంది ఉంటే రాకండి.. తనపై విమర్శలకు రామజోగయ్య శాస్త్రీ ఫైర్-tollywood lyricist ramajogaiah sastry tweet goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ramajogaiah Sastry Tweet Viral: ఇబ్బంది ఉంటే రాకండి.. తనపై విమర్శలకు రామజోగయ్య శాస్త్రీ ఫైర్

Ramajogaiah Sastry Tweet Viral: ఇబ్బంది ఉంటే రాకండి.. తనపై విమర్శలకు రామజోగయ్య శాస్త్రీ ఫైర్

Maragani Govardhan HT Telugu
Nov 25, 2022 06:06 PM IST

Ramajogaiah Sastry Tweet Viral: ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రీ తనపై నెట్టింట చేస్తున్న విమర్శలు, ట్రోల్స్‌కు స్పందించారు. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఇటు రాకండి అంటూ ఫైర్ అయ్యారు.

రామజోగయ్య శాస్త్రీ
రామజోగయ్య శాస్త్రీ

Ramajogaiah Sastry Tweet Viral: టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రీ వార్తల్లోకెక్కారు. ఎప్పుడూ తన పాటలతో ప్రేక్షకులను అలరించే రామజోగయ్య శాస్త్రీ చేసిన ట్వీట్ సామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారింది. వీరసింహారెడ్డి సినిమాలో ఆయన రాసిన జై బాలయ్య సాంగ్‌పై నెట్టింట విమర్శలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఆయనపై కూడా కొంతమంది వివాదస్పదన ట్వీట్లు చేశారు. ఆయన పేరులో ఉన్న సరస్వతి పూత్ర అనే పేరును తీసేయాలని ఫైర్ అయ్యారు. దీంతో ఆగ్రహానికి లోనైన తనతో ఇబ్బంది ఉంటే ఇటు వైపునకు రాకండి అంటూ స్పందించారు.

yearly horoscope entry point

"ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను. దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించండి. జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్థం నా పేరును సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రీగా మార్చుకున్నాను. ఈ విషయంపై వేరేవాళ్లు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకేమైనా ఇబ్బంది ఉంటే ఇటు రాకండి" అని ఆయన రాసుకొచ్చారు.

అసలు విషయానికొస్తే.. బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన వీరసింహా రెడ్డి సినిమాలో జై బాలయ్య అనే సాంగ్ శుక్రవారం విడుదలైంది. తమన్ స్వరపరిచిన ఈ పాటపై నెట్టింట పెద్ద దుమారం రేగింది. ఈ పాటపై పలువురు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఈ సాంగ్.. ఓసేయ్ రాములమ్మ టైటిల్ సాంగ్ మాదిరిగా ఉందని తమన్‌పై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఇదే సమయంలో పాట రాసిన రామజోగయ్య శాస్త్రీపై కూడా ఫైర్ అవుతున్నారు. ఆయన పేరులో ఉన్న సరస్వతీ పుత్ర పేరును తొలగించాలని అంటున్నారు.

మరోవైపు జై బాలయ్య పాటను సపోర్ట్ చేస్తూ మరికొంతమంది తమ స్పందనలు తెలియజేస్తున్నారు. పాట చాలా బాగుంది. సాహిత్యంపై పట్టులేని వాళ్లు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ రామజోగయ్యశాస్త్రీకి మద్దతుగా మాట్లాడుతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేస్తోంది. తమన్ సంగీతాన్ని సమకురుస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం