Saif Ali Khan: సైఫ్‌పై ఎటాక్ - రియాక్ట్ అయిన చిరంజీవి, ఎన్టీఆర్ - షాకింగ్ అంటూ ట్వీట్స్!
Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సైఫ్‌పై ఎటాక్ జరగడంపై టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. సైఫ్‌పై దాడి తమను షాకింగ్‌కు గురిచేసిందంటూ ట్వీట్స్ చేశారు.
Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో ఆగంతకుడు దాడి చేసిన ఘటన సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంట్లోకి చొరబడిన దొంగ సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచాడు. ఈ ఎటాక్‌లో తీవ్రంగా గాయపడిన సైఫ్ ముంబాయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. డాక్టర్లు అతడికి సర్జరీ చేయబోతున్నట్లు సమాచారం.

చిరంజీవి...ఎన్టీఆర్...
సైఫ్‌పై అతడి ఇంట్లోనే దాడిజరగడంపై సినీ వర్గాలు షాకింగ్‌కు గురయ్యాయి. సైఫ్ ఎటాక్‌పై టాలీవుడ్ హీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. సైఫ్‌పై దాడి జరిగిందనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందని చిరంజీవి ట్వీట్ చేశారు. సైఫ్ అలీఖాన్ తొందరగా కోలుకోవాలని ఈ ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు.
బాధాకరం...ఎన్టీఆర్...
సైఫ్‌పై ఎటాక్ జరిగిందని తెలిసి షాకయ్యానని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. దాడి ఘటన చాలా బాధకరమని ఎన్టీఆర్ అన్నారు. సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్య వంతుడిగా తిరిగి రావాలని ఎన్టీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ దేవర మూవీలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు.
పారిపోయే క్రమంలో...
బంద్రాలో ఉన్న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి గురువారం ఉదయం ఓ గుర్తుతెలియని ఆగంతకుడు చొరబడ్డాడు. దొంగ ఇంట్లోకి ప్రవేశించిన విషయం గమనించిన సైఫ్ అలీఖాన్ అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం. పారిపోయే క్రమంలో దొంగ సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడిచేసినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. సైఫ్ అలీఖాన్ ఒంటిపై ఆరు చోట్ల గాయాలు అయినట్లు తెలుస్తోంది. రెండు కత్తిపోట్లు లోతుగా దిగాయని డాక్టర్లు వెల్లడించారు. అతడికి సర్జరీ నిర్వహిస్తోన్నట్లు పేర్కొన్నారు.
కుటుంబసభ్యులు క్షేమం...
దొంగ ఎటాక్‌లో సైఫ్ ఒక్కడే గాయపడినట్లు మిగిలిన కుటుంబసభ్యులందరూ క్షేమంగా ఉన్నారని కరీనా కపూర్ టీమ్ పేర్కొన్నారు. దొంగతనం చేయడానికే ఆగంతకుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడని, ఈ క్రమంలోనే ఎటాక్ జరిగిందని కరీనా కపూర్ టీమ్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.
1993లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ...
1993లో రిలీజైన పరంపర మూవీతో యాక్టర్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సైఫ్ అలీఖాన్. బాలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. దిల్ చాహ్‌తాహై , కల్ హో నా హో, హమ్‌తుమ్, ఓంకారతో హిందీలో పలు బ్లాక్‌బస్టర్ మూవీలో నటించాడు. యాక్టర్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే తన కంటే వయసులో 12 ఏళ్లు పెద్దదైన అమృత సింగ్‌ను పెళ్లిచేసుకన్నాడు. 2004లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.. 2012లో కరీనాకపూర్‌ను పెళ్లాడాడు సైఫ్.