Raj Tarun - Bigg Boss: రాజ్‍తరుణ్ బిగ్‍బాస్‍కు వెళ్లనున్నారా? క్లారిటీ వచ్చేసింది.. లావణ్యతో వివాదం ఆగిపోవటంపై..
Raj Tarun - Bigg Boss Telugu 8: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‍తరుణ్.. బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో పాల్గొంటారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఆయన హౌస్‍లోకి వెళతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. భలే ఉన్నాడే మూవీ ప్రెస్‍మీట్‍లో ఈ విషయంపై ప్రస్తావన వచ్చింది.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‍తరుణ్ నుంచి వరుసగా సినిమాలు వస్తున్నాయి. పురుషోత్తముడు సినిమా జూలై 26నే థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత వారం వ్యవధిలోనే తిరగబడరా సామి చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు రాజ్‍తరుణ్ హీరోగా నటించిన ‘భలే ఉన్నాడే’ కూడా రిలీజ్‍కు రెడీ అయింది. ఈ సినిమా సెప్టెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. భలే ఉన్నాడే సినిమా ప్రమోషన్ల కోసం మూవీ టీమ్ నేడు (ఆగస్టు 27) ప్రెస్‍మీట్ నిర్వహించింది.
బిగ్‍బాస్ తెలుగు సీజన్ 8లో రాజ్ తరుణ్ పాల్గొంటారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. దీనిపై ఈ మూవీ మీట్‍లో క్లారిటీ వచ్చేసింది.
బిగ్‍బాస్‍కు వెళ్లడం లేదు
రాజ్ తరుణ్ బిగ్‍బాస్‍కు వెళ్లనున్నారా అనే ప్రశ్న ఈ ప్రెస్‍మీట్‍లో ఎదురైంది. దీనికి భలే ఉన్నాడే మూవీ దర్శకుడు శివసాయి వర్ధన్. రాజ్ తరుణ్ బిగ్‍బాస్‍కు వెళ్లే అవకాశమే లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజ్ కాసేపు కూడా కుదురుగా ఓ చోట ఉండలేరని, అలాంటి వ్యక్తి అన్ని రోజులు ఒకే హౌస్‍లో ఉండడం జరగదని ఆయన తెలిపారు.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ సెప్టెంబర్ 1న మొదలుకానుంది. ఈ సీజన్‍లో రాజ్‍తరుణ్ కంటెస్టెంట్‍గా హౌస్‍లోకి వెళతారనే రూమర్లు చాలా కాలంగా వస్తున్నాయి. ఆయన పేరు ఫైనలేజ్ అయిందనే ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, మొత్తంగా బిగ్‍బాస్‍లో రాజ్ తరుణ్ పాల్గొనడం లేదని ఇప్పుడు ఈ ప్రెస్‍మీట్‍తో స్పష్టత వచ్చేసింది.
వివాదం సడెన్‍గా ఎలా ఆగింది?
రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకొని మోసం చేశారని నటి లావణ్య చాలా ఆరోపణలు చేశారు. పోలీస్ కేసు కూడా పెట్టారు. సుమారు నెలపాటు ఈ విషయంపై దుమారం రేగింది. అయితే, కొన్నిరోజులుగా సడెన్‍గా ఈ వివాదం ఆగిపోయింది. దీనిపై భలే ఉన్నాడే ప్రెస్‍మీట్‍లో రాజ్‍తరుణ్‍కు ప్రశ్నలు ఎదురయ్యాయి.
లావణ్య వివాదం డైలీ సీరియల్‍లాగా సాగి.. ఒక్కసారిగా ఆగిపోయిందని, ఏం చేశారని రాజ్‍తరుణ్‍కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. తాను ఏమీ చేయలేదని, తన పని తాను చేసుకుంటున్నానని నవ్వుతూ చెప్పారు. ఆ వివాదం నుంచి బయటికి వచ్చినట్టున్నారంటూ క్వశ్చన్ రాగా.. మళ్లీ తనను అందులోకి పట్టుకెళ్లవద్దని రాజ్ తరుణ్ కోరారు.
వరుసగా సినిమాలు వస్తున్నందుకే ప్రమోషన్ల కోసం లావణ్య వివాదాన్ని కావాలనే రేపారా అనే ప్రశ్న కూడా రాజ్ తరుణ్‍కు ఎదురైంది. "అలా ప్రమోషన్లు ఎవరూ చేయరు. ఈ ప్రశ్నను జీర్ణించుకునేందుకు నాకు టైమ్ పట్టేలా ఉంది. అలాంటిదేమీ లేదు” అని రాజ్ తరుణ్ చెప్పారు.
భలే ఉన్నాడే సినిమాలో రాజ్ తరుణ్ సరసన మనీషా కందూకూర్ హీరోయిన్‍గా నటించారు. శ్రీకాంత్ అయ్యంగార్, హైపర్ ఆది, రచ్చ రవి కీరోల్స్ చేశారు. శివసాయి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని రవి కిరణ్ ఆర్ట్స్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ నిర్మించాయి. ఎన్‍వీ కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు.