Anaira Gupta: అది అంటే పడి చచ్చిపోతాను, ఒకరకమైన పిచ్చి.. కొత్త తెలుగు హీరోయిన్ అనైరా గుప్తా కామెంట్స్-tollywood debut heroine anaira gupta entry with deepak saroj new film and comments in movie launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anaira Gupta: అది అంటే పడి చచ్చిపోతాను, ఒకరకమైన పిచ్చి.. కొత్త తెలుగు హీరోయిన్ అనైరా గుప్తా కామెంట్స్

Anaira Gupta: అది అంటే పడి చచ్చిపోతాను, ఒకరకమైన పిచ్చి.. కొత్త తెలుగు హీరోయిన్ అనైరా గుప్తా కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Anaira Gupta About Debut Movie With Deepak Saroj: టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇస్తోంది అనైరా గుప్తా. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ సిద్ధార్థ్ రాయ్ మూవీ హీరో దీపక్ సరోజ్‌తో తెలుగు సినిమా చేయనుంది. ఈ మూవీ లాంచ్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

అది అంటే పడి చచ్చిపోతాను, ఒకరకమైన పిచ్చి.. కొత్త తెలుగు హీరోయిన్ అనైరా గుప్తా కామెంట్స్

Anaira Gupta About Debut Movie With Deepak Saroj: తెలుగులోకి ఎంతోమంది హీరోయిన్స్ కొత్తగా వస్తూనే ఉంటారు. వివిధ భాషల్లోని బ్యూటిఫుల్ ముద్దుగుమ్మలను టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్స్‌గా దింపుతుంటారు. అలాగే, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ కూడా హీరోయిన్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

దీపక్ సరోజ్ మూవీతో

అయితే, తాజాగా టాలీవుడ్‌లోకి కొత్త అమ్మాయి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఆమె పేరే అనైరా గుప్తా. సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన అనైరా గుప్తా సిద్ధార్థ్ రాయ్ మూవీ హీరో దీపక్ సరోజ్ సినిమాతో డెబ్యూ ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవల దీపక్ సరోజ్ కొత్త మూవీని పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంచ్ చేశారు.

కొత్త డైరెక్టర్, నిర్మాత, హీరోయిన్

రొమాంటిక్ లవ్ స్టోరీ జోనర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్‌పై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా చిత్రీకరించనున్నారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్‌తోపాటు దర్శకుడిగా హరీష్ గదగాని పరిచయం అవుతున్నారు. అంతేకాకండా ఈ సినిమాతో రియల్ ఎస్టేట్‌లో 20 ఏళ్లు రాణించిన తన్నీరు హరిబాబు నిర్మాతగా మారుతున్నారు.

మరో హీరోయిన్ కూడా

ఇక దీపక్ సరోజ్ కొత్త సినిమాలో అనైరా గుప్తాతోపాటు దీక్షిక కూడా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో రఘుబాబు, హైపర్ ఆది, సత్య, యూట్యూబర్ పుంజు, యాదమ్మ రాజు, రచ్చ రవి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను వైభవంగా ప్రారంభించారు.

డైరెక్టర్స్ హాజరు

ఈ కార్యక్రమానికి డైరెక్టర్స్ వేణు ఊడుగుల, ప్రదీప్ మద్దాలి, కమిటీ కుర్రాళ్లు దర్శకుడు యదు వంశీ , క ఫేమ్ సుజిత్- సందీప్, సందీప్ సరోజ్, భరత్ పెద్దగాని, ఉదయ్ శర్మ, వంశీ చాగంటి, హైపర్ ఆది, రచ్చ రవి హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం ఈ మూవీ స్క్రిప్ట్‌ని ప్రదీప్ మద్దాల, యదువంశీ అందించగా వేణు ఉడుగుల క్లాప్ కొట్టారు. సుజిత్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ఫస్ట్ షాట్‌కి సందీప్ దర్శకత్వం వహించారు.

టాలెంట్ గుర్తించారు

ఇక ఈ సినిమా లాంచ్ సందర్భంగా హీరోయిన్ అనైరా గుప్తా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. "అందరికీ నమస్కారం. ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు నేను ఎంతో సంతోషంగా, ఒక రకంగా అదృష్టంగా భావిస్తున్నాను. మా దర్శక నిర్మాతలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెబుతున్నాను. ఒక బయట వ్యక్తికి సినిమా అవకాశం రావడం మామూలు విషయం కాదు. కానీ, వారు నాలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి నాకు అవకాశం కల్పించారు" అని అనైరా గుప్తా తెలిపింది.

ఒక రకమైన పిచ్చి

"ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే కెమెరా ముందు కనపడటం అనేది నాకు చిరకాల కోరిక. చిన్నప్పటినుంచి నాకు కెమెరా అన్నా సినిమా అన్నా చాలా ఇష్టం. సినిమా అంటే నాకు ఒక రకమైన పిచ్చి, సినిమా అంటే పడి చచ్చిపోతాను. నాకు సినిమా అంటే అంత ఇష్టం" అని అనైరా గుప్తా చెప్పుకొచ్చింది.

ధమాకా ప్యాకెజ్ ఇవ్వడానికి

"దీపక్ గారితో కలిసి పనిచేయటానికి చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. మేము మా బెస్ట్ టీంతో ఎంటర్టైనింగ్ ధమాకా ప్యాకేజ్ సినిమా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము" అని తన స్పీచ్ ముగించింది టాలీవుడ్ డెబ్యూ హీరోయిన్ అనైరా గుప్తా.

కొత్త మూవీ లాంచ్, పూజా కార్యక్రమాల్లో దీపక్ సరోజ్‌తో హీరోయిన్ అనైరా గుప్తా
కొత్త మూవీ లాంచ్, పూజా కార్యక్రమాల్లో దీపక్ సరోజ్‌తో హీరోయిన్ అనైరా గుప్తా