Sunil Tamil Debut: శివ‌కార్తికేయ‌న్ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న సునీల్‌-tollywood comedian sunil to make kollywood debut with sivakarthikeyan movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tollywood Comedian Sunil To Make Kollywood Debut With Sivakarthikeyan Movie

Sunil Tamil Debut: శివ‌కార్తికేయ‌న్ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న సునీల్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 10, 2022 02:19 PM IST

Sunil Tamil Debut: క‌మెడియ‌న్ సునీల్ త‌మిళంలో అరంగేట్రం చేస్తున్నాడు. శివ‌కార్తికేయ‌న్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా ఏదంటే...

సునీల్
సునీల్

Sunil Tamil Debut: తెలుగు స్టార్ క‌మెడియ‌న్ సునీల్ త‌మిళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. శివ‌కార్తికేయ‌న్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు. తెలుగులో అగ్ర హాస్య‌న‌టుల‌లో ఒక‌రిగా సునీల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. డిఫ‌రెంట్ డైలాగ్ డెలివ‌రీ, కామెడీ టైమింగ్‌తో ఎన్నో సినిమాలు స‌క్సెస్ కావ‌డానికి సునీల్ కీలకంగా నిలిచాడు. హాస్య‌న‌టుడిగా బిజీగా ఉన్న త‌రుణంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ మ‌ర్యాద రామ‌న్న‌, పూల రంగ‌డుతో పాటు ప‌లు సినిమాల‌తో విజ‌యాల్ని అందుకున్నాడు.

హీరోగా ఆశించిన మేర అవ‌కాశాలు ద‌క్క‌క‌పోవ‌డంతో తిరిగి క‌మెడియ‌న్‌గా రీఎంట్రీ ఇచ్చిన సునీల్ ప్ర‌స్తుతం పూర్వవైభ‌వాన్ని సొంతం చేసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన‌ ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమాలో సునీల్ కామెడీకి చ‌క్క‌టి స్పంద‌న ల‌భిస్తోంది.

తాజాగా సునీల్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. శివ‌కార్తికేయ‌న్ హీరోగా త‌మిళంలో మావీర‌న్ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. సూప‌ర్ హీరో క‌థాంశంతో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్నాడు. మావీర‌న్‌లో సునీల్‌ భాగ‌మ‌వుతోన్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. అత‌డి పాత్ర క‌థాగ‌మ‌నంలో కీల‌కంగా ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది.

మావీర‌న్ సినిమాలో డైరెక్ట‌ర్ శంక‌ర్ కుమార్తె అదితిశంక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకు జాతీయ అవార్డ్ గ్ర‌హీత మ‌డోన్నే అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో మాహావీరుడు పేరుతో రిలీజ్ చేయ‌నున్నారు. కాగా సునీల్ ప్ర‌స్తుతం పుష్ప ది రూల్‌తో పాటు రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న సినిమాలో న‌టిస్తున్నాడు.

IPL_Entry_Point

టాపిక్