మలయాళంలో మోస్ట్ వయెలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా పేరు తెచ్చుకుంది మార్కో. ఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో రక్తపాతం, హింస ఎక్కువైందని కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు మార్కో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సోనీ లివ్, ఆహాలలో మార్కో ఓటీటీ రిలీజ్ అయింది.
హనీఫ్ అదాని దర్శకత్వం వహించిన మార్కో సినిమాను ప్రొడ్యూసర్ షరీఫ్ మహమ్మద్ నిర్మించారు. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మార్కో విజయం తర్వాత క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత షరీఫ్ మహమ్మద్ తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా కట్టలన్ మూవీని అనౌన్స్ చేశారు.
కట్టలన్ సినిమా పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హై-యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ప్రముఖ మలయాళ నటుడు ఆంటోనీ వర్గీస్ (పేపే) హీరోగా నటిస్తున్న కట్టలన్ సినిమాకు పౌల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ కమెడియన్ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు.
కట్టలన్ మూవీలో సునీల్ విలన్‌గా నటిస్తున్నాడని సమాచారం. దీంతో మరోసారి సునీల్ విలన్‌గా ఆకట్టుకోనున్నాడని తెలుస్తోంది. అయితే, కట్టలన్ నుంచి సునీల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సునీల్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. వెనుక భారీ వృక్షం, ముందు రెండు తుపాకులతో సునీల్ పోస్టర్ లుక్ అదిరిపోయింది.
టక్ చేసి స్పెక్ట్స్ పెట్టుకున్న సునీల్ కట్టలన్ లుక్ ఇంటెన్సివ్‌గా అట్రాక్ట్ చేస్తోంది. దీంతో సోషల్ మీడియాలో సునీల్ కట్టలన్ పోస్టర్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, కట్టలన్ సినిమాకు కాంతార 2 ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
కాగా, ఇప్పటికే విడుదలైన కట్టలన్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనంగా మారింది. వర్షంలో తడిచిన పేపే, చుట్టూ పడి ఉన్న మృతదేహాలు, ఏనుగు దంతాల మధ్య నిలబడి ఉండటం కథలో ఉండబోయే వయోలెన్స్ సూచిస్తోంది. మార్కో స్థాయిని మించి ఉండబోతోందని సంకేతాలు ఇస్తోంది.
సంబంధిత కథనం