రామ్‍చరణ్‍తో కలిసి శ్రీలీల చిందేయనున్నారా! క్రేజీ బజ్-tollywood buzz sreeleela to dance with ram charan in peddi movie special song reports ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  రామ్‍చరణ్‍తో కలిసి శ్రీలీల చిందేయనున్నారా! క్రేజీ బజ్

రామ్‍చరణ్‍తో కలిసి శ్రీలీల చిందేయనున్నారా! క్రేజీ బజ్

రామ్‍చరణ్‍తో కలిసి ఓ స్పెషల్ సాంగ్‍లో శ్రీలీల చిందేయనున్నారనే రూమర్లు బయటికి వచ్చాయి. సినీ జనాల్లో ఈ బజ్ నడుస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

రామ్‍చరణ్‍తో కలిసి శ్రీలీల చిందేయనున్నారా! క్రేజీ బజ్

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీలీల వరుసగా సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో పుష్ప 2: ది రూల్ సినిమాలో అల్లు అర్జున్‍తో కలిసి స్పెషల్ సాంగ్ చేశారు. కిసిక్ పాటలో డ్యాన్స్ ఇరగదీశారు. ఈ సాంగ్ చాలా పాపులర్ అయింది. అయితే, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‍తోనూ ఓ స్పెషల్ సాంగ్‍లో శ్రీలీల చిందేయనున్నారంటూ తాజాగా ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్‍లో హాట్ టాపిక్ అయింది.

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‍లో..

రామ్‍చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది చిత్రం చేస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రానికి ఇప్పటికే హైప్ విపరీతంగా ఉంది. షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది. ఇటీవలే వచ్చిన పెద్ది గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు.

పెద్ది సినిమాలోని స్పెషల్ సాంగ్‍ కోసం శ్రీలీల పేరును మూవీ టీమ్ ఖరారు చేసిందనే రూమర్లు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ ఓ మాస్ సాంగ్‍ను కంపోజ్ చేశారట. ఈ పాటలో రామ్ చరణ్‍తో కలిసి శ్రీలీల చిందేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, మూవీ టీమ్ నుంచి ఈ విషయంపై అధికారిక సమాచారం రాలేదు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం వైరల్‍గా మారింది. మరి చెర్రీతో కలిసి శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తారేమో చూడాలి.

బ్రేక్‍లో రామ్‍చరణ్

పెద్ది సినిమా షూటింగ్ నుంచి రామ్‍చరణ్ ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నారు. వేసవి కావడంతో సుమారు మూడు వారాలు ఆయన విరామం తీసుకొని లండన్‍కు వెకేషన్‍కు వెళతారని తెలుస్తోంది. లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కణకు కూడా హాజరవుతారు. బ్రేక్ తర్వాత మళ్లీ పెద్ది షూటింగ్‍కు వెళతారు. ఈ సినిమాలో రామ్‍చరణ్ రస్టిక్ లుక్‍లోకి మారారు. జుట్టు, గడ్డం పెంచేశారు. గ్లింప్స్ వీడియోలో చెర్రీ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్ ఆకట్టుకున్నాయి.

పెద్ది సినిమాను వచ్చే ఏడాది 2026 మార్చి 26వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో స్పోర్ట్ యాక్షన్ డ్రామా చిత్రంగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సమర్పిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ మ్యూజిక్ ఇస్తుండడం మరో హైలైట్‍గా ఉంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం