Deepak Saroj: ఆ సినిమాతో మంచి రిసెప్షన్ ఇచ్చారు.. ఆ డైలాగ్‌తో మనసుల్లో నిలిచిపోయాను.. బోల్డ్ హీరో దీపక్ సరోజ్ కామెంట్స్-tollywood bold hero deepak saroj comments on his new movie in pooja ceremony who acted in siddharth roy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Deepak Saroj: ఆ సినిమాతో మంచి రిసెప్షన్ ఇచ్చారు.. ఆ డైలాగ్‌తో మనసుల్లో నిలిచిపోయాను.. బోల్డ్ హీరో దీపక్ సరోజ్ కామెంట్స్

Deepak Saroj: ఆ సినిమాతో మంచి రిసెప్షన్ ఇచ్చారు.. ఆ డైలాగ్‌తో మనసుల్లో నిలిచిపోయాను.. బోల్డ్ హీరో దీపక్ సరోజ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Deepak Saroj Comments In New Movie Launch: సిద్ధార్థ్ రాయ్ వంటి బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీతో అలరించిన యంగ్ హీరో దీపక్ సరోజ్ చేస్తున్న మరొ కొత్త సినిమా ప్రారంభమైంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవంలో దీపక్ సరోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఆ సినిమాతో మంచి రిసెప్షన్ ఇచ్చారు.. ఆ డైలాగ్‌తో మనసుల్లో నిలిచిపోయాను.. బోల్డ్ హీరో దీపక్ సరోజ్ కామెంట్స్

Deepak Saroj Comments In New Movie Launch: ఎన్నో తెలుగు సినిమాల్లో బాల నటుడిగా అలరించి సిద్ధార్థ రాయ్ సినిమాతో హీరోగా మారాడు దీపక్ సరోజ్. బోల్డ్ అండ్ రొమాంటిక్‌గా వచ్చిన సిద్దార్థ్ రాయ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన దీపక్ సరోజ్ హీరోగా మరో సినిమా చేస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీ జానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా తాజాగా ప్రారంభమైంది.

కొత్త దర్శకుడిగా

శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. హరీష్ గదగాని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంతో తన్నీరు హరిబాబు నిర్మాతగా మారుతున్నారు. ఈ సినిమాలో దీక్షిక, అనైరా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో రఘుబాబు, హైపర్ ఆది, సత్య, యూట్యూబర్ పుంజు, యాదమ్మ రాజు, రచ్చ రవి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

గెస్ట్‌లుగా హిట్ డైరెక్టర్స్

గురువారం (డిసెంబర్ 5) అతిరధ మహారధుల సమక్షంలో ఈ చిత్రాన్ని సినిమా ఆఫీసులో వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వేణు ఊడుగుల, ప్రదీప్ మద్దాలి, కమిటీ కుర్రాళ్లు ఫేమ్ యదు వంశీ , క మూవీ ఫేమ్ సుజిత్- సందీప్, సందీప్ సరోజ్, భరత్ పెద్దగాని, ఉదయ్ శర్మ, వంశీ చాగంటి, హైపర్ ఆది, రచ్చ రవి హాజరయ్యారు.

నాన్నోయ్ రైలు తెమ్మన్నాను

పూజా కార్యక్రమాల అనంతరం ఈ సినిమా స్క్రిప్ట్‌ని ప్రదీప్ మద్దాల, యదువంశీ అందించగా వేణు ఉడుగుల క్లాప్ కొట్టారు. సుజిత్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ఫస్ట్ షాట్‌కి సందీప్ డైరెక్షన్ చేశారు. ఈ సందర్భంగా హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ.. "గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. నాన్నోయ్ రైలు తెమ్మన్నాను తెచ్చావా? అన్న ఆ అబ్బాయిని నేనే" అని అన్నాడు.

ఆ డైలాగ్ ద్వారానే

"సిద్ధార్థ్ రాయ్ సినిమాకి మంచి రిసెప్షన్ ఇచ్చారు. నా పేరు దీపక్ సరోజ్. నాన్న రైలు డైలాగు ఎప్పుడూ ఎందుకు చెబుతానంటే.. నేను ఆ డైలాగ్ ద్వారానే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాను. ఈ సినిమా డైరెక్టర్ హరీష్ గారు ఒక మంచి ప్రేమ కథతో వస్తున్నారు. నేను మంచి కథ కోసం చూస్తున్నప్పుడు ఈ కథ విన్నాను. నేను కచ్చితంగా చెప్పాల్సిన కథ అనిపించింది" అని దీపక్ సరోజ్ తెలిపాడు.

అది నా అదృష్టం

"టీం కూడా చాలా మంచి టీం. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ గారు ఇప్పటివరకు ఎంత మంచి సంగీతం ఇచ్చారో మనకు తెలుసు. ఆయన నా సినిమాకి సంగీతం అందించడం నా అదృష్టం. మా నిర్మాత హరిబాబు గారు ఇది మొదటి సినిమానే అయినా ఆయన చాలా కాలం ఇక్కడ ఉంటారని నాకు అనిపించింది" అని సిద్ధార్థ్ రాయ్ హీరో దీపక్ సరోజ్ చెప్పాడు.

మంచి టీం సెట్ అయింది

"సినిమా కోసం ఏమైనా చేయడానికి సిద్ధమైన నిర్మాతలతో సినిమా చేయడం చాలా బాగుంటుంది. సినిమాటోగ్రాఫర్ సురేష్ గారు ఎడిటర్ వరప్రసాద్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే మంచి టీం సెట్ అయింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన అతిథులకు మీడియా వారికి చాలా థాంక్స్. మా పిఆర్ఓ శివ గారికి ప్రత్యేక ధన్యవాదాలు" అని దీపక్ సరోజ్ తన స్పీచ్ ముగించాడు.