Payal Rajput | ఆడవాళ్లకూ తాగాలనిపిస్తుంది.. హాట్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్-tollywood actress payal rajput bold comments on liquor promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Payal Rajput | ఆడవాళ్లకూ తాగాలనిపిస్తుంది.. హాట్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్

Payal Rajput | ఆడవాళ్లకూ తాగాలనిపిస్తుంది.. హాట్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్

Maragani Govardhan HT Telugu
Apr 19, 2022 01:11 PM IST

లిక్కర్ బ్రాండ్‌కు ప్రమోట్ చేసిందనే కారణంగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ట్రోలింగ్ గురయ్యింది. దీంతో ఈ ముద్దుగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆడవాళ్లకు కూడా ఆల్కహాల్ తాగాలనిపిస్తుందని, ఎంజాయ్ చేయాలనిపిస్తుందని బోల్డ్ కామెంట్ చేసింది.

<p>పాయల్ రాజ్‌పుత్&nbsp;</p>
పాయల్ రాజ్‌పుత్ (instagram)

ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో ప్రముఖులు ఏం మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. వారు చేసే వాణిజ్య ప్రకటనలు కూడా చర్చలకు దారితీస్తున్నాయి. గతంలో కాజల్, సమంత, రెజీనా లాంటి హీరోయిన్లు లిక్కర్ బ్రాండ్లకు ప్రచారం చేయగా.. వారిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. మొన్నటికి మొన్న నిధి అగర్వాల్ కండోమ్ యాడ్స్‌కు ప్రచారం చేసిందని.. నెట్టింట పెద్ద దుమారమే రేగింది. ఈ విధంగా మద్యం తయారీ కంపెనీలు, కండోమ్ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నవారు చాలా మంది ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కూడా చేరిపోయింది. ఆమె ఓ విస్కీ బ్రాండ్‌ను ప్రమోట్ చేయగా.. విమర్శలు రావడంతో ఆ పోస్టును తొలగించింది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మపై ట్రోలింగ్ ఆగలేదు.

దీంతో విసుగు చెందిన పాయల్.. కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె కామెంట్లు హాట్ టాపిక్‌గా మారిపోయాయి. "ప్రభుత్వం ఆమోదించిన బ్రాండ్లను ప్రమోట్ చేయడంలో తప్పేముంది. అయినా అది లీగల్ కూడా. ఆల్కహాల్‌ను ఆడవాళ్లకు కూడా తాగాలని పిస్తుంది. వారు కూడా చిల్ అవుదామనుకుంటారు. విమర్శి చేసేవారికి ప్రతిదీ తప్పులాగే కనిపిస్తుంటుంది. వారి గురించి నేను పట్టించుకోను." అని పాయల్ స్పష్టం చేసింది.

ఆమె పెట్టిన ఈ పోస్టుకు డేంజరస్ హీరోయిన్ నైనా గంగూలీ మద్దతు తెలిపింది. "మహిళలు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఇదే సమయంలో శక్తిమంతంగానూ ఉంటారు. కాబట్టి బ్రాండ్లు వారిని వెతుక్కుంటూ వస్తాయి" అని పాయల్ కామెంట్స్‌ను సపోర్ట్ చేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మల స్పందనలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.

లిక్కర్ బ్రాండ్లకు హీరోలు ప్రచారం చేసినప్పుడు కలగని ఇబ్బంది.. హీరోయిన్లు చేస్తే ఎందుకు కలుగుతుందో అర్థం కావట్లేదని మరికొంతమంది పాయల్‌కు మద్దతు తెలుపుతున్నారు. రెండూ తప్పయితే హీరోయన్లతో పాటు హీరోలను కూడా ట్రోలింగ్ చేయాలని అభిప్రాయపడుతున్నారు.

తెలుగులో ఆర్ఎక్స్100 సినిమాతో అరంగేట్రం చేసిన పాయల్ రాజ్‌పుత్.. ఆనతి కాలంలోనే బిజీ అయిపోయింది. ఓ పక్క సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తోందీ ముద్దుగుమ్మ. ఆర్ఎక్స్100 ఇచ్చిన విజయంతో ఇతర భాషల్లోనూ అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం