Indraja: సీఏం భార్యగా త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నది ఇంద్రజ. ఆమె ప్రధాన పాత్రలో సీఏం పెళ్లాం పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అజయ్ , జయసుధ , సుమన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గడ్డం రమణా రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. "సీఎం పెళ్లాం మూవీ ప్రమోషనల్ సాంగ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో లాంఛ్ చేశారు.
ఈ సాంగ్ లాంఛ్ వేడుకలో ఇంద్రజ మాట్లాడుతూ..."సీఎం పెళ్లాం సినిమా ఒక మంచి సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. సీఎం పెళ్లాం బయటకు వస్తే ఎలా ఉంటుందన్ని ఆలోచనను రేకెత్తించేలా దర్శకుడు ఈ మూవీలో ఆవిష్కరించారు. నవ్విస్తూనే ఆలోచింపజేసే సినిమా ఇది. ప్రతి ఒక్కరి రియల్ లైఫ్ లో చూసినవి, విన్నవి, జరిగిన ఇన్సిడెంట్స్ మా సినిమాలో కనిపిస్తాయి. ఇటీవల కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆ జాబితాలో మా సినిమా నిలుస్తుందనే నమ్మకముంది" అని చెప్పింది.
నటుడు అజయ్ మాట్లాడుతూ - “ఈ సినిమాలో నేను సీఎంగా నటిస్తే , నా భార్య పాత్రను ఇంద్రజ చేశారు. \నేను సీఎంగా చేసినా సినిమా మొత్తం ఇంద్రజ కనిపిస్తారు. . నటీనటులు ఎలా సమయపాలన పాటించాలో ఇంద్రజను చూసి నేర్చుకున్నాను. సీఎం పెళ్లాం సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుందని చెప్పగలను” అన్నారు
నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ - “పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఇది. దర్శకుడు చెప్పిన కథ విని ఇంప్రెస్ అయ్యాను. సీఎంగా అజయ్, ఆయన భార్య పాత్రలో ఇంద్రజ నటన ఆకట్టుకుంటుంది” అని అన్నారు. “ప్రమోషనల్ సాంగ్ హైదరాబాద్ నగరం నేపథ్యంగా రూపొందించాం. మన నగరం ఎలా ఉంది అన్నది ఈ పాటలో చూపించాం. ఒకే ఒక్కడు చిత్రంలో వన్ డే సీఎంను చూశాం. మా మూవీలో సీఎం పెళ్లాం బయటకు వస్తే ఏం జరిగింది అన్నది చూపించబోతున్నాం. సామాజిక నేపథ్యమున్న మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. త్వరలోనే మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని దర్శకుడు గడ్డం రమణారెడ్డి చెప్పారు.
సీఏం పెళ్లాం సినిమాలో భరత్, ప్రీతి నిగమ్, రూపాలక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. ప్రిన్స్ హెన్సీ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి నాగశ్రీనివాస్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే టీవీ షోస్ చేస్తోంది ఇంద్రజ. ఈ ఏడాది తల, కథాకమామీషు, 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్‌తో అనే సినిమాలు చేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది.
సంబంధిత కథనం