30 Years Prudhvi Alimony settlement to his Wife: టాలీవుడ్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ మధ్యలో రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ.. వివాదంలో చిక్కుకోవడంతో ప్రస్తుతం సినిమాలపై తిరిగి తన ఫోకస్ పెట్టారు. 30 ఇయర్స్ పృథ్వీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడుకు జిల్లా ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది. పృథ్వీ తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెలా రూ.8 లక్షల భరణం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రతి నెలా 10వ తేదీ లోపు సదరు మొత్తం చెల్లించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది.
విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీకి.. తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనాకి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ అలియాస్ 30 ఇయర్స్ పృథ్వీతో 1984లో వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తే, కుమారుడు ఉన్నారు. అయితే తనను తరచూ పృథ్వీరాజ్ వేధించేవాడని శ్రీలక్ష్మీ కోర్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. పృథ్వీరాజ్ విజయవాడలో తన పుట్టింట్లో ఉంటూనే చెన్నైలో సినిమా అవకాశాలకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నీ తమ తల్లిదండ్రులే భరించేవారని స్పష్టం చేశారు. 2016 ఏప్రిల్ 5న తనను ఇంటి నుంచి గెంటేశారని, దీంతో తాను పుట్టింటికి వచ్చి అక్కడే ఉంటున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన భర్త సినిమాలు, సీరియల్స్ ద్వారా నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నాడని, అతడి నుంచి భరణం ఇప్పించాల్సిందిగా 2017 జనవరి 10 న్యాయస్థానాన్ని ఆశ్రయించారు శ్రీలక్ష్మీ. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి.. నటుడు పృథ్వీ తన భార్యకు నెలకు రూ.8 లక్షలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ప్రతి నెలా 10 తేదీలోగా మెయింటనెన్స్ చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ భరణం కేసు వేసినప్పటి నుంచి వర్తిస్తుందని స్పష్టం చేశారు.
తెలుగు చిత్రసీమలో 30 ఇయర్స్ పృథ్వీగా బాగా పాపులర్ అయ్యారు. గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేసిన ఆయన. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛైర్మన్ పదవీ దక్కింది. అయితే ఓ వివాదంలో చిక్కుకున్న ఆయన ఆ పదవీని కోల్పోయారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న పృథ్వీ.. ఇటీవలే మెగా బ్రదర్ నాగ బాబును కలిసి జనసేన పార్టీలో చేరారు.
సంబంధిత కథనం
టాపిక్