Kiran Abbavaram Engagement: హీరో కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ తేదీ ఫిక్స్.. తన తొలి హీరోయిన్‍తోనే..
Kiran Abbavaram - Rahasya Gorak Engagement: కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది. తన తొలి చిత్రంలో హీరోయిన్‍గా నటించిన రహస్య గోరక్‍నే ఆయన వివాహం చేసుకున్నారు. వివరాలివే..
Kiran Abbavaram Engagement: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఆయన ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయింది. తన తొలి చిత్రం ‘రాజావారు రాణిగారు’లో హీరోయిన్‍గా నటించిన రహస్య గోరక్‍ను కిరణ్ వివాహం చేసుకోనున్నారు. వీరి ఎంగేజ్‍మెంట్ మార్చి 13వ తేదీన జరగనుందని సమాచారం బయటికి వచ్చింది. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ ప్రేమలో ఉన్నారని చాలాకాలంగా రూమర్లు వస్తుండగా.. అవే నిజమయ్యాయి. వారిద్దరూ పెళ్లికి రెడీ అయ్యారు.
ఐదేళ్లుగా ప్రేమ
షార్ట్ ఫిల్మ్‌లతో బాగా పాపులర్ అయిన కిరణ్ అబ్బవరం 2019లో ‘రాజావారు రాణిగారు’తో సినిమాల్లోకి అడుగుపెట్టారు. కిరణ్ హీరోగా నటించిన ఆ చిత్రంలో రహస్య గోరక్ హీరోయిన్‍గా చేశారు. ఈ మూవీ హిట్ అవడంతో ఇద్దరూ పాపులర్ అయ్యారు. అయితే, రాజావారు రాణిగారు షూటింగ్ సమయంలోనే కిరణ్, రహస్య ప్రేమలో పడ్డారని రూమర్లు వచ్చాయి. వారిద్దరూ డేటింగ్‍లో ఉన్నారని చాలాసార్లు పుకార్లు వినిపించాయి.
గతేడాది ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం.. రహస్య పేరు వినగానే తెగ సిగ్గుపడ్డారు. రహస్యతో ప్రేమలో ఉన్నారా అని ప్రశ్న ఎదురవగా.. సమాధానం చెప్పేందుకు మెలికలు తిరిగారు. ఏ ఇంటర్వ్వూలోనూ తాను ఇలా దొరికిపోలేని అన్నారు. దీంతో కిరణ్ అబ్బవరం, రహస్య ప్రేమలో ఉన్నారని తేలిపోయింది.
ఎంగేజ్‍మెంట్ వివరాలు
మొత్తంగా సుమారు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్, రహస్య వివాహానికి రెడీ అయ్యారు. మార్చి 13వ తేదీన సాయంత్రం వీరి ఎంగేజ్‍మెంట్ జరగనుంది. హైదరాబాద్‍లోని ఓ రిసార్టులో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుంది. ఆగస్టులో వీరి వివాహం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
సినిమాలు ఇలా..
కిరణ్ అబ్బవరం హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎస్ఆర్ కల్యాణ మండపం తర్వాత అతడికి ఆ రేంజ్‍లో విజయం దక్కలేదు. సెబాస్టియన్ పీసీ, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. గతేడాది వచ్చిన ‘వినరోభాగ్యము విష్ణు కథ’ పర్వాలేదనిపించింది. అయితే, మీటర్, రూల్స్ రంజన్ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. కిరణ్‍కు నిరాశను మిగిల్చాయి.
గతేడాది మూడు సినిమాలు వచ్చినా.. ఒక్క హిట్ కూడా కిరణ్‍కు దక్కలేదు. అయితే, ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సైలెంట్‍గా ఓ సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కిరణ్ సరసన రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్‍గా నటిస్తున్నారట. షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు వచ్చిందని ఇటీవల సమాచారం బయటికి వచ్చింది. ఈ సినిమాకు దిల్ రూబా అనే టైటిల్ కూడా ఖరారైందని టాక్. అయితే, ఈ మూవీ గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ ఏడాదే ఈ చిత్రం రిలీజ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు, రాజావారు రాణిగారు చిత్రం తర్వాత షర్బత్ అనే తమిళ సినిమాలో హీరోయిన్‍గా నటించారు రహస్య గోరక్. ఆ తర్వాతే మరే మూవీ చేయలేదు.