Gemini Suresh: చాలా కాలం తర్వాత కమెడియన్స్ అంతా కలిసి నటించిన సినిమా.. నటుడు జెమిని సురేష్ కామెంట్స్-tollywood actor gemini suresh comments on comedians in coffee with a killer ott streaming on aha press meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gemini Suresh: చాలా కాలం తర్వాత కమెడియన్స్ అంతా కలిసి నటించిన సినిమా.. నటుడు జెమిని సురేష్ కామెంట్స్

Gemini Suresh: చాలా కాలం తర్వాత కమెడియన్స్ అంతా కలిసి నటించిన సినిమా.. నటుడు జెమిని సురేష్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Feb 01, 2025 12:26 PM IST

Gemini Suresh About Coffee With A Killer On OTT Release: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కాఫీ విత్ ఏ కిల్లర్. జనవరి 31న ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో నటుడు జెమిని సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

చాలా కాలం తర్వాత కమెడియన్స్ అంతా కలిసి నటించిన సినిమా.. నటుడు జెమిని సురేష్ కామెంట్స్
చాలా కాలం తర్వాత కమెడియన్స్ అంతా కలిసి నటించిన సినిమా.. నటుడు జెమిని సురేష్ కామెంట్స్

Gemini Suresh About OTT Movie Coffee With A Killer: సంగీత దర్శకుడు, సింగర్ ఆర్‌పి పట్నాయక్ కథ రచనా దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ నిర్మాతగా తెరకెక్కించిన సినిమా కాఫీ విత్ ఏ కిల్లర్. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన కాఫీ విత్ ఏ కిల్లర్ ఆహాలో జనవరి 31 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

yearly horoscope entry point

కాఫీ విత్ ఏ కిల్లర్ ఓటీటీ రిలీజ్

టెంపర్ వంశీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, అంబటి శ్రీను, శ్రీరాప, జెమిని సురేష్ తదితరులు కీలకపాత్ర పోషించిన కాఫీ విత్ ఏ కిల్లర్ ఆహాలో ఓటీటీ రిలీజ్ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నటుడు జెమిని సురేష్ ఇంట్రెస్టింగ్ ఈ విధంగా స్పందించారు.

నా చుట్టూనే తిరుగుతుంది

"అందరికీ నమస్కారం. ఈ చిత్రంలో నటించిన నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ చిత్రంలో కాఫీ షాప్ మేనేజర్ పాత్ర పోషిస్తున్నాను. సినిమా అంతా నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఈ సినిమాలో కిల్లర్ ఎవరు? ఎవరిని చంపుతాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే కచ్చితంగా ఆహాలో ఈ చిత్రాన్ని చూడాల్సిందే" అని జెమిని సురేష్ అన్నారు.

అందరూ చాలా టాలెంటెడ్

"ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఎంతో మంది కమెడియన్స్ అంతా కలిసి చాలా కాలం తర్వాత నటించిన చిత్రం ఇది. ఈ సినిమాలో ప్రతి సీన్ ఎంటర్టైన్మెంట్‌గా ఉంటుంది. చిత్రానికి సాంకేతిక బృందం ఎంతో ప్రత్యేకమైనది. ఈ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులు అందరూ చాలా టాలెంటెడ్" అని జెమిని సురేష్ తెలిపారు.

నా పాత్ర గుర్తుండిపోతుంది

"ఈ రోజుల్లో ఒక సినిమా తీసి బయటికి వెళ్లాలంటే ఎంతో ఛాలెంజ్ అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో సతీష్ గారు ఈ చిత్రాన్ని నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రంలో నా పాత్ర మీకు గుర్తుండిపోతుంది. అలాగే ఎన్నో మంచి సినిమాలు అందిస్తున్న ఆహా ఓటీటీలో ఈ చిత్రం ఇంకా మంచి సినిమాగా నిలిచిపోతుంది. ఈ చిత్ర టీం అందరికీ నా ధన్యవాదాలు" అని యాక్టర్ జెమిని సురేష్ చెప్పుకొచ్చారు.

ఆయన ఎంతో ముఖ్యమైన వ్యక్తి

నటి శ్రీరాప (నేక్‌డ్ మూవీ ఫేమ్) మాట్లాడుతూ.. "మీడియా వారికి పెద్దలకు అందరికీ నమస్కారం. కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమా గురించి మాట్లాడాలి అంటే ముందుగా నేను గౌతమ్ గారి గురించి మాట్లాడాలి. ఆయన ఈ చిత్రానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన వారికి నా కృతజ్ఞతలు" అని చెప్పింది.

తెలియనివారు లేరు

"అలాగే ఆర్‌పి పట్నాయక్ గారు అంటే తెలియని వారు లేరు. ఆయన సంగీత దర్శకుడుగా అలాగే డైరెక్టర్‌గా ఎంతో మంచి పేరు ఉన్న వ్యక్తి. ఆయన దర్శకత్వంలో పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది" అని తెలిపింది నటి శ్రీరాప.

Whats_app_banner

సంబంధిత కథనం