Today OTT Releases: ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన రెండు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు.. ఒకటి రెండేళ్ల తర్వాత..
Today OTT Releases: ఒకే రోజు ఓటీటీలోకి రెండు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు వచ్చాయి. రెండు వేర్వేరు ఓటీటీల్లో వేర్వేరు జానర్లకు చెందిన ఈ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో ఒకటి థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత రావడం విశేషం.
Today OTT Releases: ఓటీటీలోకి గురువారం (సెప్టెంబర్ 19) రెండు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇందులో ఒకటి రెండేళ్ల కిందట థియేటర్లలో రిలీజై.. ఇప్పటికే ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చింది. ఇక మరొకటి రాజ్ తరుణ్ నటించిన యాక్షన్ డ్రామా. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేదు.
సురాపానం ఓటీటీ స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి వచ్చింది తెలుగు మూవీ సురాపానం. నిజానికి జూన్, 2022లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ గతేడాదే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే తాజాగా ఈటీవీ విన్ ఓటీటీ కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ చేస్తోంది. గురువారం (సెప్టెంబర్ 19) నుంచి సురాపానం ఈ ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది.
సురాపానం మూవీ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తవ్వకాల్లో బయటపడిన ఓ శివలింగం, దాంతో పాటు దొరికిన ఓ పానీయాన్ని తాగిన హీరో.. ఆ తర్వాత శివలింగం మిస్ కావడం.. ఇలా సాగిపోతుంది ఈ ఫ్యాంటసీ కామెడీ మూవీ. సురాపానం సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమాకు ఐఎండీబీలో 7.4 రేటింగ్ ఉంది. సురాపానం మూవీలో ప్రగ్యా నయన్, అజయ్ ఘోష్, ఫిష్ వెంకట్, చమ్మక్ చంద్రలాంటి వాళ్లు నటించగా.. సంపత్ కుమార్ డైరెక్ట్ చేశాడు.
తిరగబడరా సామీ ఓటీటీ స్ట్రీమింగ్
ఇక గురువారమే (సెప్టెంబర్ 19) ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీ తిరగబడరా సామీ. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ఈ యాక్షన్ డ్రామా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ఆగస్ట్ 2న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సుమారు 50 రోజుల తర్వాత ఇప్పుడు ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. రాజ్ తరుణ్ సరసన ఈ సినిమాలో మౌల్వీ మల్హోత్రానే ఫిమేల్ లీడ్ గా నటించింది.
కొంతకాలంగా ఈ హీరోయిన్ వల్లే రాజ్ తరుణ్ తనను పక్కన పెట్టాడంటూ అతని గర్ల్‌ఫ్రెండ్ లావణ్య రచ్చరచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరూ కలిసి నటించిన తిరగబడరా సామీ థియేటర్లలో రిలీజైంది. తిరగబడరా సామీ మూవీకి మిక్స్డ్ టాక్ రావటంతో థియేటర్లలో పెద్దగా ఆడలేదు.
అంతకు ముందు వారమే పురుషోత్తముడు చిత్రంతో రాజ్‍కు నిరాశ ఎదురుకాగా.. ఈ మూవీ కూడా ప్లాఫ్ అయింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ పరాజయాలు ఎదురయ్యాయి. తిరగబడరా సామీ మూవీని సురక్ష్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై శివకుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి జీవన్ బాబు సంగీతం అందించారు.