Today OTT Releases: ఓటీటీలో ఈ రోజు సినిమాలు, వెబ్ సిరీస్‌ జాతర.. ఒకే ఓటీటీలో ఆరు.. తెలుగులోనూ స్ట్రీమింగ్-today ott releases movies web series streaming on friday 15th november on prime video netflix zee5 aha video hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Releases: ఓటీటీలో ఈ రోజు సినిమాలు, వెబ్ సిరీస్‌ జాతర.. ఒకే ఓటీటీలో ఆరు.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Today OTT Releases: ఓటీటీలో ఈ రోజు సినిమాలు, వెబ్ సిరీస్‌ జాతర.. ఒకే ఓటీటీలో ఆరు.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Hari Prasad S HT Telugu
Nov 15, 2024 02:23 PM IST

Today OTT Releases: ఓటీటీలో ఈరోజు అంటే శుక్రవారం (నవంబర్ 15) ఒక్క రోజే సినిమాలు, వెబ్ సిరీస్ ఎన్నో రిలీజ్ అవుతున్నాయి. వీటిలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మలయాళంలాంటి భాషల్లో కంటెంట్ రావడం విశేషం.

ఓటీటీలో ఈ రోజు సినిమాలు, వెబ్ సిరీస్‌ జాతర.. ఒకే ఓటీటీలో ఆరు.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో ఈ రోజు సినిమాలు, వెబ్ సిరీస్‌ జాతర.. ఒకే ఓటీటీలో ఆరు.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Today OTT Releases: ఓటీటీల్లోకి ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ రావడం సహజమే. ఈ వారం కూడా అలా ఎన్నో వచ్చాయి. అయితే ప్రతి వారం కంటే కాస్త ఎక్కువగానే ఈరోజు (నవంబర్ 15) కొత్తగా మూవీస్, సిరీస్ రావడం విశేషం. వీటిని నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, ఆహా వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా, సోనీలివ్ లాంటి వాటిలో చూడొచ్చు.

ఈరోజు ఓటీటీ రిలీజెస్ ఇవే

ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ - సోనీలివ్

సోనీలివ్ ఓటీటీలో ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే వెబ్ సిరీస్ శుక్రవారం (నవంబర్ 15) స్ట్రీమింగ్ కు వచ్చింది. దేశ విభజన సమయంలో జరిగిన ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో అందుబాటులో ఉంది.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అల్లు అర్జున్ ఎపిసోడ్ - ఆహా వీడియో

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే నాలుగో సీజన్ లో భాగంగా నాలుగో ఎపిసోడ్ ఇప్పుడు ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ కు పుష్ప 2 స్టార్ అల్లు అర్జున్ గెస్టుగా వచ్చాడు.

యుద్రా - ప్రైమ్ వీడియో

హిందీ మూవీ యుద్రా కూడా ఈరోజు నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. తన పేరెంట్స్ హత్యకు ప్రతీకారం కోసం చూసే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది.

కురుక్కు - ప్రైమ్ వీడియో

కురుక్కు ఓ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. రెండు హత్యల కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.

పైఠనీ - జీ5 ఓటీటీ

పైఠనీ అనే హిందీ మూవీ నేరుగా జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇది ఓ చేనేత కార్మికురాలి వారసత్వాన్ని కొనసాగించడానికి ఆమె కూతురు చేసే ప్రయత్నం. ఈ ఎమోషనల్ డ్రామాను జీ5లో చూడొచ్చు.

మా నాన్న సూపర్ హీరో - జీ5

ఇప్పటికే ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉన్న మా నాన్న సూపర్ హీరో మూవీ శుక్రవారం (నవంబర్ 15) నుంచి జీ5 ఓటీటీలోకి కూడా వచ్చింది.

అదితట్టు - మనోరమ మ్యాక్స్

అదితట్టు అనే మలయాళం మూవీ ఈరోజు మనోరమ మ్యాక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కొందరు మత్స్యకారులు, బతకడానికి వాళ్లు పడే కష్టాల చుట్టూ తిరిగే కథ.

జోకర్ ఫోలీ ఎ డూ - ప్రైమ్ వీడియో

జోకర్ ఫోలీ ఎ డూ మూవీ ప్రైమ్ వీడియోలోకి రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది.

హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్ - ప్రైమ్ వీడియో

హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్ అనే వెబ్ సిరీస్ రెండో సీజన్ ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీల్లోకి వచ్చింది. ఇదొక రొమాంటిక్ కామెడీ సిరీస్. యువతను బాగా ఆకట్టుకుంటుంది.

యదా యదా హి - సన్ నెక్ట్స్

యదా యదా హి అనే కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సన్ నెక్ట్స్ లోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన ఏడాదిన్నర తర్వాత ఈరోజు ఓటీటీలో అడుగుపెట్టింది.

ద డే ఆఫ్ ద జాకల్ - జియో సినిమా

ద డే ఆఫ్ ద జాకల్ వెబ్ సిరీస్ తొలి సీజన్ శుక్రవారం (నవంబర్ 15) స్ట్రీమింగ్ కు వచ్చింది. ఓ హంతకుడు, పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే తిరిగే థ్రిల్లింగ్ సిరీస్ ఇది.

అక్యూజ్డ్ - ప్రైమ్ వీడియో

అక్యూజ్డ్ అనే ఇంగ్లిష్ మూవీ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ది డైవ్ - ప్రైమ్ వీడియో

ది డైవ్ ఓ ఇంగ్లిష్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఇది కూడా ప్రైమ్ వీడియోలోకే వచ్చింది. ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళంలలో చూడొచ్చు.

Whats_app_banner