ఓటీటీలోకి ఇవాళ 2 సినిమాలు, 2 సిరీస్‌లు.. 3 మాత్రమే చాలా స్పెషల్.. 2 తెలుగులో ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!-today ott release movies telugu veera dheera sooran l2 empuraan you season 5 etoile ott streaming netflix amazon prime ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి ఇవాళ 2 సినిమాలు, 2 సిరీస్‌లు.. 3 మాత్రమే చాలా స్పెషల్.. 2 తెలుగులో ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ 2 సినిమాలు, 2 సిరీస్‌లు.. 3 మాత్రమే చాలా స్పెషల్.. 2 తెలుగులో ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ రెండు సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లు కలిపి మొత్తంగా 4 డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రెండు ఇదివరకే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే, ఆ నాలుగింటిలో కచ్చితంగా చూడాల్సిన స్పెషల్స్‌గా మూడు మాత్రమే ఉంటే, తెలుగులో మాత్రం 2 ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

ఓటీటీలోకి ఇవాళ 2 సినిమాలు, 2 సిరీస్‌లు.. 3 మాత్రమే చాలా స్పెషల్.. 2 తెలుగులో ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ప్రతివారం సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, వీటిలో ఎక్కువగా గురు, శుక్రవారాల్లో ఓటీటీ రిలీజెస్ అవుతుంటాయి. ఇవాళ (ఏప్రిల్ 24) కూడా ఓటీటీలోకి కొన్ని స్పెషల్ సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్న, వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

వీర ధీర శూరన్ ఓటీటీ

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన రీసెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ వీర ధీర శూరన్. రాయన్ ఫేమ్ దుషారా విజయన్ ఇందులో హీరోయిన్‌గా విక్రమ్‌ సరసన చేసింది. అలాగే, వీర ధీర శూరన్ సినిమాలో వర్సటైల్ యాక్టర్స్ ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు ఇతర కీలక పాత్రలు పోషించారు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

మార్చి 27న థియేటర్లలో తెలుగు, తమిళ భాషల్లో వీర ధీర శూరన్ విడుదలైంది. అయితే, సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మోస్తరు కలెక్షన్స్ మాత్రమే రాబట్టగలిగింది. కానీ, ఐఎమ్‌డీబీ నుంచి మాత్రం పదికి 7.4 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇవాళ ఓటీటీలోకి వీర ధీర శూరన్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

అమెజాన్ ప్రైమ్‌లో వీర ధీర శూరన్ ఓటీటీ రిలీజ్ అయింది. నేటి నుంచి తెలుగు, తమిళ వంటి రెండు భాషల్లో వీర ధీర శూరన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ్టీ ఓటీటీ రిలీజెస్‌లో వీర ధూర శూరన్ కచ్చితంగా చూడాల్సిన స్పెషల్ మూవీ.

ఎల్2 ఎంపురాన్ ఓటీటీ

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్-పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో రెండోసారి తెరకెక్కిన సినిమా ఎల్2 ఎంపురాన్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఎల్2 ఎంపురాన్ ఇవాళ ఓటీటీలోకి అడుగుపెట్టింది. బాక్సాఫీస్ వద్ద రూ. 262 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఎల్2 ఎంపురాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూశారు.

వారి ఎదురుచూపులకు అనుగుణంగా ఇవాళ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఎల్2 ఎంపురాన్ ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ వంటి నాలుగు భాషల్లో ఇవాళ ఎల్2 ఎంపురాన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. నేటి ఓటీటీ రిలీజ్ సినిమాల్లో ఎల్2 ఎంపురాన్ కూడా చూడాల్సిన స్పెషల్ మూవీనే.

యూ సీజన్ 5 ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో పాపులర్ హిట్ వెబ్ సిరీస్‌ల్లో యూ ఒకటి. సైకలాజికల్, రొమాంటిక్, క్రైమ్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన యూ సిరీస్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సిరీస్‌ నుంచి చివరి సీజన్‌గా యూ 5 ఓటీటీలోకి నేరుగా రానుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో యూ సీజన్ 5 ఓటీటీ రిలీజ్ కానుంది. ఇంగ్లీష్‌లో యూ 5 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కూడా చూడాల్సిన స్పెషల్ అని చెప్పుకోవచ్చు.

ఎటోయిల్ ఓటీటీ

అమెజాన్ ప్రైమ్‌లోకి నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్న న్యూ వెబ్ సిరీస్ ఎటోయిల్ (Etoile). ఇంగ్లీష్‌లో కామెడీ డ్రామా వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన ఎటోయిల్ ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు ఓటీటీ రిలీజ్ కానుంది. కొత్త సిరీస్ కావడంతో దీనిపై పెద్దగా అంచనాలు లేవు. కాబట్టి, ఎటోయిల్ తప్పా, వీర ధీర శూరన్, ఎల్2 ఎంపురాన్, యూ సీజన్ 5 చూడాల్సిన ఓటీటీ స్పెషల్స్‌గా ఉన్నాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం