ఓటీటీలోకి ఇవాళ 6 సినిమాలు.. 3 చాలా స్పెషల్.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఒకేదాంట్లోనే 4.. ఒక్కోటి ఒక్కో రకం!-today ott release movies telugu thug life the sandman season 2 air all india first rankers ott streaming etv win netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి ఇవాళ 6 సినిమాలు.. 3 చాలా స్పెషల్.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఒకేదాంట్లోనే 4.. ఒక్కోటి ఒక్కో రకం!

ఓటీటీలోకి ఇవాళ 6 సినిమాలు.. 3 చాలా స్పెషల్.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఒకేదాంట్లోనే 4.. ఒక్కోటి ఒక్కో రకం!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఆరు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా మూడు మాత్రమే ఉన్నాయి. అవి కూడా తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక ఈ ఆరులో నాలుగు ఒకే ప్లాట్‌ఫామ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవడం విశేషం.

ఓటీటీలోకి ఇవాళ 6 సినిమాలు.. 3 చాలా స్పెషల్.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఒకేదాంట్లోనే 4.. ఒక్కోటి ఒక్కో రకం!

ఓటీటీలోకి ఇవాళ ఆరు సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ

థగ్ లైఫ్‌ (తెలుగు, తమిళ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూలై 3

ది సాండ్‌మ్యాన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- జూలై 3

బిచ్ వర్సెస్ రిచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 3

అన్-ఎక్స్ యూ (ఫిలిపినో రొమాంటిక్ కామెడీ చిత్రం)- జూలై 3

ఈటీవీ విన్ ఓటీటీ

ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ (తెలుగు కామెడీ వెబ్ సిరీస్)- జూలై 3

చౌపల్ ఓటీటీ

రౌలా బేస్‌మెంట్ డా (పంజాబీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 3

ఇలా ఇవాళ (జూలై 3) ఆరు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా థగ్ లైఫ్, ది సాండ్‌మ్యాన్ సీజన్ 2, ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వంటి మూడు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా తెలుగులోనే ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన 6 సినిమాల్లో ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 4 అందుబాటులో ఉన్నాయి.

థగ్ లైఫ్ ఓటీటీ

భారతీయుడు 2 వంటి భారీ ఫ్లాప్ మూవీ తర్వాత కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా థగ్ లైఫ్. అంతేకాకుండా ఈ సినిమాకు లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించడం, కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో 38 ఏళ్ల తర్వాత ఓ సినిమా వచ్చింది. దీంతో థగ్ లైఫ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఐదు భాషల్లో

కానీ, ఆ అంచనాలను థగ్ లైఫ్ అందుకోలేకపోయింది. కమల్‌తోపాటు త్రిష, శింబు, అభిరామి, సాన్య మల్హోత్రా, నాజర్ కీలక పాత్రలు పోషించిన థగ్ లైఫ్ ఓటీటీకి వచ్చేసింది. ఇవాళ్టీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ ఐదు భాషల్లో థగ్ లైఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం