Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 3 సినిమాలు.. తెలుగులో 2 స్పెషల్, 1 డైరెక్ట్ స్ట్రీమింగ్.. మూడు విభిన్న జోనర్స్!-today ott release movies telugu love you nanamma dasettante cycle kingston ott streaming on zee5 etv win manorama max ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Movies: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 3 సినిమాలు.. తెలుగులో 2 స్పెషల్, 1 డైరెక్ట్ స్ట్రీమింగ్.. మూడు విభిన్న జోనర్స్!

Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 3 సినిమాలు.. తెలుగులో 2 స్పెషల్, 1 డైరెక్ట్ స్ట్రీమింగ్.. మూడు విభిన్న జోనర్స్!

Sanjiv Kumar HT Telugu

Today OTT Movies Release Telugu: ఓటీటీలోకి ఇవాళ మూడు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో రెండు తెలుగు భాషలో ఓటీటీ రిలీజ్ అయితే.. ఒకటి డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి మూడు డిఫరెంట్ జోనర్స్ ఉన్న ఆ సినిమాలు ఏంటీ, ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 3 సినిమాలు.. తెలుగులో 2 స్పెషల్, 1 డైరెక్ట్ స్ట్రీమింగ్.. మూడు విభిన్న జోనర్స్!

Today OTT Movies Release Telugu: ఓటీటలోకి ఇవాళ మూడు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో రెండు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, మరొకటి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటీ, వాటి జోనర్స్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కింగ్‌స్టన్ ఓటీటీ

కోలీవుడ్‌లో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరొందిన జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన మరో సినిమానే కింగ్‌స్టన్. మొట్టమొదటి తమిళ సీ అడ్వెంచర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీగా కింగ్‌స్టన్ తెరకెక్కింది. ఈ సినిమాకు కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. హీరోగా చేసిన ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

అలాగే, కింగ్‌స్టన్ మూవీలో జీవి ప్రకాష్ కుమార్‌కు జోడీగా గ్లామర్ బ్యూటీ దివ్య భారతి హీరోయిన్‌గా నటించింది. ఓ గ్రామానికి ఉన్న శాపం, సముద్రంలో దొంగతనం, జాంబీలు, హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన కింగ్‌స్టన్‌కు థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 7న తెలుగు, తమిళంలో విడుదలైన కింగ్‌స్టన్ మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి 10కి 4.4 ఘోరమైన రేటింగ్ సాధించుకుంది.

జీ5 ఓటీటీ

రేటింగ్, రెస్పాన్స్ ఎలా ఉన్న కింగ్‌స్టన్ ఈ వారం ఓటీటీ రిలీజ్ సినిమాల్లో స్పెషల్‌గా మారింది. ఇవాళ (ఏప్రిల్ 13) జీ5లో కింగ్‌స్టన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగు, తమిళ భాషల్లో కింగ్‌స్టన్ ఓటీటీ రిలీజ్ అయింది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు జీ5 ఓటీటీలో కింగ్‌స్టన్ మూవీని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

లవ్ యూ నానమ్మ ఓటీటీ

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ ప్రతి ఆదివారం కొత్త సినిమాలతో తీసుకొచ్చిన సిరీస్ కథా సుధ. ఈ ఈటీవీ విన్ కథా సుధలో భాగంగా ఏప్రిల్ 13న ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన మూవీ లవ్ యూ నానమ్మ. 28 నిమిషాల 37 సెకన్ల రన్ టైమ్ ఉన్న లవ్ యూ నానమ్మ మూవీకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరించారు. గంగనమోని శేఖర్ కథా, దర్శకత్వం అందించారు.

సాకేత్ కోమందూరి సంగీతం అందించిన ఈ సినిమా నానమ్మ, మనవరాలి బంధంపై తెరకెక్కింది. తనకు కథలు చెప్పే నానమ్మను మిస్ అయ్యే ఓ పాప, నీతులు చెబుతున్నందుకు అత్తను విసిగించుకునే కోడలు, కొడుకు ఇంట్లో కాకుండా కూతురి ఇంటికి తల్లిని పంపించేయడం వంటి అంశాలతో ఎమోషనల్‌ కథగా లవ్ యూ నానమ్మ తెరకెక్కింది. నేటి నుంచి డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈటీవీ విన్‌లో లవ్ యూ నానమ్మను ఎంచక్క చూసి ఆనందించొచ్చు.

దసెట్టాంటే సైకిల్ ఓటీటీ

మలయాళంలో కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కింది దసెట్టాంటే సైకిల్ (Dasettante cycle). నటుడు హరీష్ పేరడి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అంజన అప్పుకుట్టన్, కబని కీలక పాత్రలు పోషించారు. అఖిల్ కవ్వుంగల్ కథ, దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది.

ఇవాళ్టీ (ఏప్రిల్ 13) నుంచి మనోరమ మ్యాక్స్‌లో దసెట్టాంటే సైకిల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, కేవలం మలయాళ భాషలోనే దసెట్టాంటే సైకిల్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే, ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ మూడు సినిమాలు ఒక్కోటి ఒక్కో జోనర్‌లో ఉండటం విశేషం.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం