Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 12 సినిమాలు.. 7 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగులో.. ఇక్కడ చూసేయండి!-today ott release movies telugu love reddy big game all we imagine as light gunaah 2 i want to talk amazon prime hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Movies: ఓటీటీలోకి ఇవాళ 12 సినిమాలు.. 7 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగులో.. ఇక్కడ చూసేయండి!

Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 12 సినిమాలు.. 7 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగులో.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Jan 03, 2025 08:58 AM IST

Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 12 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో 7 చాలా స్పెషల్‌గా ఉంటే, అందులో ఒక స్ట్రైట్ తెలుగు సినిమాతోపాటు రెండు డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. ఇక అవన్నీ హారర్ ఫాంటసీ, థ్రిల్లర్, యాక్షన్, రొమాంటిక్, అడ్వెంచర్ థ్రిల్లర్ జోనర్స్‌లో ఉన్నాయి.

ఓటీటీలోకి ఇవాళ 12 సినిమాలు.. 7 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగులో.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ 12 సినిమాలు.. 7 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగులో.. ఇక్కడ చూసేయండి!

Today OTT Movies Telugu: ఇవాళ ఒక్కరోజే (జనవరి 3) 12 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో ప్రతిష్టాత్మక అవార్డ్ గోల్డెన్ గ్లోబ్‌కు నామినేట్ అయిన సినిమాతోపాటు తెలుగు స్టైట్ మూవీ, పలు డబ్బింగ్ చిత్రాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇక ఇవన్నీ హారర్ ఫాంటసీ, థ్రిల్లర్, రొమాంటిక్, ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్స్ జోనర్స్‌లో ఉన్నాయి.

yearly horoscope entry point

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

గుణ సీజన్ 2 (హిందీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 3

ఐ వాంట్ టు టాక్ (హిందీ సినిమా)- జనవరి 3

క్రిస్మస్ ఈవ్ ఇన్ మిల్లర్స్ పాయింట్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా చిత్రం)- జనవరి 3

విక్‌డ్ ఇంగ్లీష్ (మ్యూజికల్ ఫాంటసీ మూవీ)- జనవరి 3

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (అవార్డ్ విన్నింగ్ మలయాళ డ్రామా మూవీ)- జనవరి 3

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

బిగ్ గేమ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ అడ్వెంచర్ సినిమా)- జనవరి 3

డేంజరస్ వాటర్స్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- జనవరి 3

టైగర్స్ ట్రిగ్గర్ (చైనీస్ ఫ్యామిలీ యాక్షన్ మూవీ)- జనవరి 3

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

సెల్లింగ్ ది సిటీ (ఇంగ్లీష్ రియాలిటీ వెబ్ సిరీస్)- జనవరి 3

వెన్ ది స్టార్స్ గాసిప్ (కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- జనవరి 4

ఆహా ఓటీటీ

లవ్ రెడ్డి (తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం)- జనవరి 3

ఆరగన్ (తమిళ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం) (ఆహా తమిళ్)- జనవరి 3

ది మ్యాన్ ఆన్ ది రోడ్ (తెలుగు డబ్బింగ్ ఇటాలియన్ థ్రిల్లర్ మూవీ)- వీఆర్ఎఫ్ ఓటీటీ- జనవరి 3

ఇవాళ ఓటీటీలోకి 12

ఇలా ఇవాళ ఒక్కరోజే సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి మొత్తంగా 12 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌కు నామినేట్ అయిన మలయాళ డ్రామా సినిమా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ స్పెషల్‌గా ఉంది. అలాగే, తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా లవ్ రెడ్డితోపాటు తెలుగు డబ్బింగ్ సినిమాలు బిగ్ గేమ్ (అడ్వెంచర్ థ్రిల్లర్), ది మ్యాన్ ఆన్ ది రోడ్ (థ్రిల్లర్) ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

తెలుగులో మూడు

వీటితోపాటు అభిషేక్ బచ్చన్ నటించిన తండ్రీకూతుళ్ల బంధానికి అద్దం పట్టే ఎమోషనల్ హిందీ మూవీ ఐ వాంట్ టు టాక్, తమిళ హారర్ ఫాంటసీ సినిమా ఆరగన్, థ్రిల్లర్ డ్రామా సిరీస్ గుణ 2 కూడా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇలా మొత్తంగా ఆరు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో 7 స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో మూడు మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Whats_app_banner