OTT Releases: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే వచ్చేసిన 4 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు- ప్రతీది డిఫరెంట్ జోనర్- అన్నీ తెలుగులోనే!
Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవన్నీ ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ జోనర్‌లో తెరకెక్కిన సినిమాలు. అంతేకాకుండా ఈ నాలుగు మూవీస్ అన్ని తెలుగులోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవడం విశేషం.
Today OTT Movies Telugu: ఓటీటీలో ఎప్పటికప్పుడు డిఫరెంట్ జోనర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కోరోజులోనే బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఇవాళ (నవంబర్ 8) ఓటీటీలోకి ఏకంగా నాలుగు సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అది కూడా ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ జోనర్‌తో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఓ లుక్కేద్దాం.
దేవర ఓటీటీ
ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మూవీతో బాలీవుడ్ గ్లామర్ బ్యూటి జాన్వీ కపూర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయం అయిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 27న థియేటర్లలో పాన్ ఇండియా సినిమాగా విడుదలైన హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దేవర వరల్డ్ వైడ్‌గా రూ. 500 కోట్ల వరకు బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. దాంతో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా దేవర సాలిడ్ హిట్ అందుకుంది. అలాంటి దేవర మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ ఓటీటీ రిలీజ్ అయింది. సౌత్‌తోపాటు హిందీ భాషలో కూడా దేవర ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
వేట్టయన్ ఓటీటీ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా వేట్టయన్. హంటర్ అనేది దీనికి క్యాప్షన్. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన యాక్షన్ అడ్వెంచర్ సినిమా వేట్టయన్‌కు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన వేట్టయన్ మూవీ అక్టోబర్ 10న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది.
సరిగ్గా నెల రోజులకు వేట్టయన్ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వేట్టయన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. రెండు గంటల 45 నిమిషాల రన్ టైమ్ ఉన్న వేట్టయన్ సినిమాలో రానా దగ్గుబాటి, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఏఆర్ఎమ్ ఓటీటీ
మలయాళ పాపులర్ హీరో టొవినో థామస్ నటించిన యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ఏఆర్ఎమ్. అయంతే రందమ్ మోషనమ్ అనేది దీని పూర్తి నిర్వచనం. జితిన్ లాల్ దర్శకత్వంలో రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఏఆర్ఎమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 106 కోట్ల వరకు కలెక్షన్స్ కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఐఎమ్‌డీబీ నుంచి 7.6 రేటింగ్ సాధించిన ఏఆర్ఎమ్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు రెండున్నర గంటల నిడివి ఉన్న ఏఆర్ఎమ్ మూవీలో తెలుగు బేబమ్మ కృతి శెట్టి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది.
జనక అయితే గనక ఓటీటీ
టాలీవుడ్‌లో అతి చిన్న సినిమాగా వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న మూవీ జనక అయితే గనక. అనుకోకుండా తండ్రిగా మారిన ఓ భర్త కండోమ్ కంపెనీపై కేసు వేయడమనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. కామెడీ యాంగిల్‌లో రూపొందిన జనక అయితే గనక మూవీలో సమాజంపై సెటైరికల్‌గా మేసేజ్ ఇచ్చారు.