ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు.. చాలా స్పెషల్‌గా 5.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!-today ott release movies telugu jaat pelli kani prasad jigel the accountant 2 ott streaming on amazon prime netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు.. చాలా స్పెషల్‌గా 5.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు.. చాలా స్పెషల్‌గా 5.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 10 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఐదు సినిమాలు ఉంటే.. అవన్నీ కూడా తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ మూవీస్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు.. చాలా స్పెషల్‌గా 5.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే పది సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సోనీ లివ్ ఈటీవీ విన్ వంటి తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ సినిమాలన్నీ డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. అయితే, యాక్షన్, కామెడీ, రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ వంటి వివిధ జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

జిన్నీ అండ్‌ జార్జియా సీజన్‌ 3 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5

టైర్స్ సీజన్‌ 2 (హాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 5

జాట్‌ (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్‌ 5

బరాకుడా క్వీన్స్ సీజన్ 2 (స్వీడిష్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5

అన్‌ఇన్వైటెడ్ (ఫిలిప్పినో క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 5

జియో హాట్‌స్టార్ ఓటీటీ

నైట్ కోర్ట్ సీజన్ 3 (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)-జూన్ 5

సోనీ లివ్ ఓటీటీ

అల్లప్పుజా జింఖానా (తెలుగు డబ్బింగ్ మలయాళ స్పోర్ట్స్ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 5

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ది అకౌంటాంట్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 5

ఈటీవీ విన్ ఓటీటీ

పెళ్లి కాని ప్రసాద్ (తెలుగు కామెడీ ఫ్యామిలీ చిత్రం)- జూన్ 5

సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ

జిగేల్ (తెలుగు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 5

ఓటీటీలో 10 స్ట్రీమింగ్

ఇలా ఇవాళ (జూన్ 5) 10 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని హిందీ డెబ్యూ మూవీ జాట్, కామెడీ చిత్రం పెళ్లి కాని ప్రసాద్, రొమాంటిక్ థ్రిల్లర్ జిగేల్, స్పోర్ట్స్ కామెడీ సినిమా అల్లప్పుజా జింఖానా, తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ది అకౌంటాంట్ 2 చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్‌గా తెలుగులో 5

ఈరోజు ఓటీటీ రిలీజ్ అయిన ఈ మొత్తం 10 సినిమాల్లో చూసేందుకు చాలా స్పెషల్‌గా 5 మూవీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఐదు సినిమాలన్నీ ఇంట్రెస్టింగ్‌గా తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం