ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు- ఎన్టీఆర్ వార్ 2తోపాటు చూసేందుకు 6 చాలా స్పెషల్- తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్!-today ott release movies jr ntr hrithik war 2 the resurrected meghalu cheppina prema katha ott streaming netflix etv win ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు- ఎన్టీఆర్ వార్ 2తోపాటు చూసేందుకు 6 చాలా స్పెషల్- తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్!

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు- ఎన్టీఆర్ వార్ 2తోపాటు చూసేందుకు 6 చాలా స్పెషల్- తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 6 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 2 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ వార్ 2తోపాటు మేఘాలు చెప్పిన ప్రేమకథ వంటి రొమాంటిక్ మూవీ కూడా ఉంది.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు- ఎన్టీఆర్ వార్ 2తోపాటు చూసేందుకు 6 చాలా స్పెషల్- తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్!

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు స్పై యాక్షన్, హారర్ మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ డ్రామా వంటి జోనర్స్ ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఏంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

వార్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09

ది రీసరెక్టెడ్ (మాండరిన్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09

ది ఉమెన్ ఇన్ కాబిన్ 10 (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం)- అక్టోబర్ 09

విక్టోరియా బెక్‌హమ్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09

ది మేజ్ రన్నర్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09

చౌపల్ ఓటీటీ

డ్రామే ఆలే (పంజాబీ కామెడీ ఫిల్మ్)- అక్టోబర్ 09

సోచ్ తోహ్ పరే (పంజాబీ రొమాంటిక్ డ్రామా సినిమా)- అక్టోబర్ 09

ఈటీవీ విన్ ఓటీటీ

మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా సినిమా)- అక్టోబర్ 09

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

సాక్వన్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)-అక్టోబర్ 09

సైనా ప్లే ఓటీటీ

పీడబ్ల్యూడీ- ప్రపోజల్ వెడ్డింగ్ డివోర్స్ (మలయాళ కామెడీ చిత్రం)- అక్టోబర్ 09

ఓటీటీలోకి ఇవాళ 10 సినిమాలు

ఇలా ఇవాళ (అక్టోబర్ 09) ఒక్కరోజే 10 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో వార్ 2, మేఘాలు చెప్పిన ప్రేమకథ, ది మేజ్ రన్నర్, ది ఉమెన్ ఇన్ కాబిన్ 10, ది రీసరెక్టెడ్, విక్టోరియా బెక్‌హమ్ 6 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

అలాగే, వీటన్నింటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా రెండు సినిమాలు మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఆ రెండు సినిమాల్లో ఒకటి వార్ 2. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేసిన వార్ 2 ఓటీటీ రిలీజ్ కోసం ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఆ రెండు మాత్రమే

ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలైన వార్ 2 సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. యాక్షన్ సీన్స్, తారక్-హృతిక్ డ్యాన్స్ అదరిపోయిందని రివ్యూలు వచ్చాయి. దీంతో వార్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ చాలా స్పెషల్‌గా మారింది. వార్ 2 తర్వాత తెలుగులో వచ్చిన రొమాంటిక్ సినిమా మేఘాలు చెప్పిన ప్రేమకథ కూడా స్పెషల్‌గా ఉంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం