ఓటీటీలోకి ఇవాళ 9 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. తెలుగులో 1 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!-today ott release movies flat girls deep cover zodi aa okkati adakku ott streaming on etv win amazon prime netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి ఇవాళ 9 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. తెలుగులో 1 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ 9 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. తెలుగులో 1 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 5 ఉంటే తెలుగులో మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఒకే ఒక్కటి ఓటీటీ రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ 9 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. తెలుగులో 1 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిల యాక్షన్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి జోనర్ మూవీస్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఫ్యూబర్ సీజన్ 2 (ఇంగ్లీష్ స్పై థ్రిల్లర్ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 12

ఫ్లాట్‌ గర్ల్స్ (థాయి డ్రామా చిత్రం)- జూన్ 12

మసామీర్ జూనియర్ (సౌదీ అరేబియన్ యానిమేటెడ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 12

అండ్ ద బ్రెడ్ విన్నర్ ఈజ్ (ఫిలిప్పీన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 12

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ది ట్రేయిటర్స్ (హిందీ రియాలిటీ షో)- జూన్ 12

డీప్ కవర్ (హిందీ డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 12

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ మియామీ సీజన్ 4 (అమెరికన్ రియాలిటీ వెబ్ సిరీస్)- జూన్ 12

జోడీ (పంజాబీ రొమాంటిక్ కామెడీ చిత్రం)- చౌపల్ ఓటీటీ- జూన్ 12

ఆ ఒక్కటి అడక్కు (తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- జూన్ 12

ఇవాళ ఓటీటీలోకి 9

ఇలా ఇవాళ (జూన్ 12) ఒక్కరోజు 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో ఫ్లాట్ గర్ల్స్, డీప్ కవర్, జోడీ, ఆ ఒక్కటి అడక్కు, అండ్ ద బ్రెడ్ విన్నర్ ఈజ్ సినిమాలు చూసేందుకు ఐదు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అంటే, ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన 9లో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఐదు ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

అయితే, ఇందులో తెలుగు భాషలో మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఒకే ఒక్క సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీనే ఆ ఒక్కటి అడక్కు. చాలా రోజుల తర్వాత హీరో అల్లరి నరేష్ కామెడీ జోనర్‌లో నటించిన సినిమా ఇది. ఈ మూవీలో అల్లరి నరేష్‌కు జోడీగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా యాక్ట్ చేసింది.

ఆ ఒక్కటి అడక్కు ఓటీటీ రిలీజ్

రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఆ ఒక్కటి అడక్కు సినిమా ఇది వరకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది థియేట్రికల్, ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆ ఒక్కటి అడక్కు మూవీ సుమారు ఏడాదికి ఈటీవీ విన్‌లో నేటి నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం