ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే తెలుగులో నాలుగు సినిమాలు.. హారర్, కామెడీ, యాక్షన్, మిస్టరీ జోనర్లలో.. ఎక్కడంటే?-today ott movies telugu sarangapani jathakam arjun son of vyjayanthi inheritance fear street prom queen ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే తెలుగులో నాలుగు సినిమాలు.. హారర్, కామెడీ, యాక్షన్, మిస్టరీ జోనర్లలో.. ఎక్కడంటే?

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే తెలుగులో నాలుగు సినిమాలు.. హారర్, కామెడీ, యాక్షన్, మిస్టరీ జోనర్లలో.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ తెలుగు భాషలో నాలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవన్నీ హారర్, కామెడీ, యాక్షన్, మిస్టరీ థ్రిల్లర్ వంటి నాలుగు విభిన్న జోనర్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ నాలుగు సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే తెలుగులో నాలుగు సినిమాలు.. హారర్, కామెడీ, యాక్షన్, మిస్టరీ జోనర్లలో.. ఎక్కడంటే?

ఓటీటీలోకి ఇవాళ (మే 23) ఒక్కరోజే తెలుగు భాషలో నాలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. హారర్, కామెడీ, యాక్షన్, మిస్టరీ థ్రిల్లర్ వంటి నాలుగు విభిన్న జోనర్స్‌లో ఉన్న ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సారంగపాణి జాతకం ఓటీటీ

కోర్టు సక్సెస్ తర్వాత ప్రియదర్శి నచించిన సినిమా సారంగపాణి జాతకం. పాపులర్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రూప కొడువాయూర్ హీరోయిన్‌గా చేయగా.. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైన సారంగపాణి జాతకం సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి.

కానీ, కామెడీ ట్రాక్ బాగుందని ప్రశంసలు తెచ్చుకుంది సారంగపాణి జాతకం. తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీగా వచ్చిన సారంగపాణి జాతకం ఓటీటీ రిలీజ్ అయింది. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో సారంగపాణి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు నెల రోజుల గ్యాప్‌లో ఓటీటీ రిలీజ్ అయిన సారంగపాణి జాతకం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీ

నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి తల్లి కొడులుగా నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఇది వరకే అమెజాన్ ప్రైమ్‌లో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (మే 23) మరో ఓటీటీలోకి ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది.

ఆహాలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీ రిలీజ్ అయింది. శుక్రవారం నుంచి అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా చేసింది.

ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్ ఓటీటీ

అమెరికన్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్. ఫియర్ స్ట్రీట్ బుక్ సిరీస్‌లోని నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. మాట్ పామర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫియర్ స్ట్రీట్ ఫిల్మ్ సిరీస్‌లో నాలుగోది. ఈ మూవీ అంతా షాడిసైడ్ హైస్కూల్ ప్రొమ్ క్వీన్ పోటీల నేపథ్యంలో సాగుతుంది.

హారర్, క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్న ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్ ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. మే 23న నెట్‌ఫ్లిక్స్‌లో ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లో ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇన్‌హెరిటెన్స్ ఓటీటీ

హాలీవుడ్‌లో తెరకెక్కిన ఎస్పాయినేజ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇన్‌హెరిటెన్స్. నీల్ బర్గర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫెయోబె దినేవర్ మెయిన్ లీడ్ రోల్ చేసింది. లేడి ఒరియెంటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌గా వచ్చిన ఇన్‌హెరిటెన్స్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఇవాళ వచ్చేసింది. లయన్స్ గేట్ ప్లేలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం వంటి 4 భాషల్లో ఇన్‌హెరిటెన్స్ ఓటీటీ రిలీజ్ అయింది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం