Today OTT Movies: ఓటీటీలో ఇవాళ 10 సినిమాలు- స్పెషల్‌గా 7, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!-today ott movies telugu pottel dhoom dhaam melo movie dance ikon 2 manorajyam pyaar testing on zee5 netflix amazon prime ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Movies: ఓటీటీలో ఇవాళ 10 సినిమాలు- స్పెషల్‌గా 7, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

Today OTT Movies: ఓటీటీలో ఇవాళ 10 సినిమాలు- స్పెషల్‌గా 7, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో 7 స్పెషల్‌ కాగా తెలగులో 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇవన్నీ బోల్డ్, కామెడీ యాక్షన్, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్ జోనర్లతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి.

ఓటీటీలో ఇవాళ 10 సినిమాలు- స్పెషల్‌గా 7, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

OTT Release Movies Today Telugu: ఓటీటీలోకి ప్రతివారం సరికొత్త కంటెంట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటే.. ఒక్క శుక్రవారం మాత్రం అనేక చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. అలాగే, ఇవాళ (ఫిబ్రవరి 14) కూడా అంటే, ఈ శుక్రవారం అధిక సంఖ్యలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో బోల్డ్, ఫ్యామిలీ థ్రిల్లర్స్, కామెడీ యాక్షన్, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్, రియాలిటీ షోస్ వంటి వివిధ తరహా జోనర్స్‌లో ఉన్నాయి.

ఇవాళ ఓటీటీ రిలీజ్ సినిమాలు

ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, జీ5, ఆహా, ఎమ్ఎక్స్ ప్లేయర్ వంటి వివిధ ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. మరి ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ధూమ్ ధామ్ ( తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 14

మెలో మూవీ ( తెలుగు డబ్బింగ్ కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 14

ఐయామ్ మ్యారీడ్.. బట్! (కొరియన్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్- ఫిబ్రవరి 14

లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 8 (ఇంగ్లీష్ రియాలిటీ షో)- ఫిబ్రవరి 14

ప్యార్ కా ప్రొఫెసర్ (హిందీ రొమాంటిక్ అండ్ బోల్డ్ వెబ్ సిరీస్)- అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- ఫిబ్రవరి 14

మనోరాజ్యం (మలయాళ బోల్డ్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 14

డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ (తెలుగు రియాలిటీ డ్యాన్స్ షో)- ఆహా ఓటీటీ- ఫిబ్రవరి 14

ప్యార్ టెస్టింగ్ (హిందీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- ఫిబ్రవరి 14

సబ్‌సర్వియన్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఫిబ్రవరి 14

పొట్టేల్ (తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమా)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- ఫిబ్రవరి 14

ఇవాళ ఓటీటీలోకి 10

ఇలా ఇవాళ పది వరకు సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ యాక్షన్ ఫిల్మ్ ధూమ్ ధామ్, తెలుగు ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా మూవీ పొట్టేల్, తెలుగు డబ్బింగ్ కొరియన్ రొమాంటిక్ సిరీస్ మెలో మూవీ ఇంట్రెస్టింగ్‌గా ఉండున్నాయి.

స్పెషల్‌గా 7- తెలుగులో 4

అలాగే, హిందీ రొమాంటిక్ అండ్ బోల్డ్ వెబ్ సిరీస్ ప్యార్ కా ప్రొఫెసర్, మలయాళ బోల్డ్ చిత్రం మనోరాజ్యం, రొమాంటిక్ కామెడీ సిరీస్ ప్యార్ టెస్టింగ్, తెలుగు రియాలిటీ షో డ్యాన్స్ ఐకాన్ 2 కూడా స్పెషల్‌గా ఉన్నాయి. ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన పదిలో మూడు సినిమాలు, మూడు వెబ్ సిరీసులు, ఒక డ్యాన్స్ రియాలిటీ షోతో కలిపి 7 వరకు స్పెషల్‌గా చూసేలా ఉన్నాయి. ఇందులో కూడా 4 తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం