Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 8 సినిమాలు- ఏకంగా 6 చాలా స్పెషల్- తెలుగులో 3 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు స్ట్రీమింగ్‌కు రాగా వాటిలో ఏకంగా 6 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అయితే, వాటిలో 3 తెలుగులో రిలీజ్ అయ్యాయి. అందులోనూ క్రైమ్ మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రాలు ఉన్నాయి.
Today OTT Movies Telugu: ఓటీటీలోకి వారం వారం కొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చిన ఎక్కువగా శుక్రవారం నాడు రిలీజ్ అవుతుంటాయి. ఈ వారం గురువారం (జనవరి 30), శుక్రవారం (జనవరి 31) రెండు రోజుల్లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది స్నో గర్ల్ సీజన్ 2 (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 31
లుక్కాస్ వరల్డ్ (హాలీవుడ్ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 31
కాఫీ విత్ ఏ కిల్లర్ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఆహా ఓటీటీ- జనవరి 31
ది సీక్రెట్స్ ఆఫ్ ది షిలేదార్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 31
ఐడెంటిటీ (తెలుగు డబ్బింగ్ మలయాళం క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జీ5 ఓటీటీ- జనవరి 31
పార్ట్‌నర్స్ (మలయాళ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- సైనా ప్లే ఓటీటీ- జనవరి 31
క్వీర్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ముబి ఓటీటీ- జనవరి 31
బ్యాడ్ జీనియస్ (హిందీ డబ్బింగ్ ఇంగ్లీష్ థ్రిల్లర్ మూవీ) లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జనవరి 31
ఐడెంటిటీ ఓటీటీ రిలీజ్
ఇలా ఇవాళ సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని ఓటీటీలోకి 8 స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మలయాళ క్రైమ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ సినిమా ఐడెంటిటీ. త్రిష, టొవినో థామస్ నటించిన ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. జీ5 ఓటీటీలో 9 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించుకున్న ఐడెంటిటీ నేటి నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
కాఫీ విత్ ఏ కిల్లర్ ఓటీటీ
ఇక తెలుగు క్రైమ్ థ్రిల్లర్‌గా తెరెక్కిన కాఫీ విత్ ఏ కిల్లర్ కూడా స్పెషల్ కానుంది. ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమెడియన్ శ్రీనివాస్ బాబు, దర్శకుడు రవిబాబు, సత్యం రాజేష్, రఘు బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సెవెన్ హిల్స్ సతీష్ నిర్మించిన కాఫీ విత్ ఏ కిల్లర్ ఈటీవీ విన్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
పార్ట్‌నర్స్ ఓటీటీ
అలాగే, మరో మలయాళ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా పార్ట్‌నర్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. నవీన్ జాన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ధ్యాన్ శ్రీనివాసన్, బిచ్చగాడు ఫేమ్ సాట్నా టైటస్, రోనీ డేవిడ్, కళాభవన్ షాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ సైనా ప్లే ఓటీటీలో మలయాళంలో మాత్రమే రిలీజ్ అయింది.
వీటితోపాటు ఛత్రపతి శివాజీ నిధుల కథాంశంగా తెరకెక్కిన ది సీక్రెట్స్ ఆఫ్ ది షిలేదార్స్ కూడా తెలుగులో ఆసక్తిగా ఉండనుంది. అలాగే, పరీక్షల్లో ఫ్రాడ్ చేసే నేపథ్యంలో లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి వచ్చిన ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా బ్యాడ్ జీనియస్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. ఇంకా, నెట్‌ఫ్లిక్స్ ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ లుక్కాస్ వరల్డ్ కూడా చెప్పుకోదగ్గ సినిమానే.
6 స్పెషల్-3 తెలుగులో
ఇలా నేడు ఓటీటీ రిలీజ్ అయిన ఎనిమిదింట్లో 5 సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో ఆరు స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇక వీటిలో తెలుగులో రెండు సినిమాలు, ఒక సిరీస్‌తో మూడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం