Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు- 2 మాత్రమే స్పెషల్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
New OTT Releases Friday: ఓటీటీల్లో శుక్రవారం (ఆగస్ట్ 23) నాడు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తం 9 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో కేవలం రెండు మాత్రమే చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వాటిలో ఒకటి తమిళ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ కాగా మరోటి బోల్డ్ బ్యూటి వెబ్ సిరీస్. ఇవి ఏ ఓటీటీలో ఉన్నాయో లుక్కేద్దాం.
Today OTT Releases: ఈ వారం ఓటీటీలో 20కిపైగా సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, రెగ్యులర్‌గా ఎక్కువగా ఓటీటీ రిలీజ్ అయ్యే శుక్రవారం నాడు అంటే ఇవాళ (ఆగస్ట్ 23) కేవలం 9 మాత్రమే విడుదల అయ్యాయి. ఇక వాటిలో కూడా రెండు మాత్రమే చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
బోల్డ్ బ్యూటి
ఫ్రైడే స్పెషల్‌గా రిలీజైన ఈ రెండింట్లో ఒకటి తమిళ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా కాగా.. మరొకటి బోల్డ్ బ్యూటి బయోగ్రఫీగా తెరకెక్కిన వెబ్ సిరీస్. మరి ఈ రెండింటితోపాటు మిగతా సినిమాలు, వెబ్ సిరీసులు ఏ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఇన్‌కమింగ్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్ట్ 23
ది ఫ్రాగ్ (కొరియిన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 24
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ
ఫాలో కర్లో యార్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 23
రాయన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా)- ఆగస్ట్ 23
ఆహా ఓటీటీ
ఉనర్వుగల్ తొడరకథై (తమిళ చిత్రం)- ఆగస్ట్ 23
శాఖాహారి (తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రం)- ఆగస్ట్ 24
మరిన్ని ఓటీటీ మూవీస్
ది సుప్రీమ్ ఎట్ ఎర్ల్స్ యూ కెన్ ఈట్ (ఇంగ్లీష్ చిత్రం)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- ఆగస్ట్ 23
డ్రైవ్ అవే డాల్స్ (ఇంగ్లీష్ సినిమా)- జియో సినిమా ఓటీటీ- ఆగస్ట్ 23
పాచింకో సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- ఆగస్ట్ 23
ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్ (ఇంగ్లీష్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఆగస్ట్ 23
స్వకార్యం సంభవబాహులం (మలయాళ సినిమా)- మనోరమ ఓటీటీ- ఆగస్ట్ 23
హీరోగానే కాకుండా
ఇలా ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో చాలా స్పెషల్‌గా చెప్పుకోవాల్సి సినిమా రాయన్. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగానే కాకుండా తొలిసారి దర్శకత్వం వహించడ విశేషం. సందీప్ కిషన్ కూడా ప్రధాన పాత్ర పోషించిన రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాయన్ ఇవాళ చాలా ప్రత్యేకమైన సినిమా అని చెప్పుకోవచ్చు.
సోషల్ మీడియా సెన్సేషన్
ఈ మూవీ తర్వాత ఇంట్రెస్టింగ్‌గాచెప్పుకునేది ఫాలో కర్లో యార్ అనే వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ బయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కినట్లు సమాచారం. ఇందులో ఉర్ఫీకి సంబంధించిన వ్యక్తిగత, కెరీర్, స్పిట్స్ విల్లా ప్రోగ్రామ్, బిగ్ బాస్‌లో తన తీరును చూపించనున్నారని తెలుస్తోంది.
మర్డర్ మిస్టరీ
ఇక ఇవాళ్టి సంగతి పక్కన పెడితే రేపు మాత్రం మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ శాఖాహారి తెలుగులో డబ్ అయి ఓటీటీ రిలీజ్ కానుంది. ఇది క్యూరియాసిటీ కలిగిస్తున్న సినిమా. దీనికి ఐఎమ్‌డీబీలో 7.3 రేటింగ్ ఉండటం విశేషం.