Today OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 22 సినిమాలు.. దేవరతోపాటు 7 చాలా స్పెషల్.. మర్డర్, క్రైమ్ థ్రిల్లర్స్ కూడా!
Today OTT Release Movies Telugu: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 22 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఒక్క 7 మాత్రమే చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతోపాటు కరీనా కపూర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ది బకింగ్ హామ్ మర్డర్స్ ఉంది. వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.
Today OTT Movies Release: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే ఏకంగా 22 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతోపాటు మూడు బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ ఉన్నాయి. అందులోనూ మర్డర్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్ ఉన్నాయి. మరి, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
దేవర (తెలుగు సినిమా)- నవంబర్ 8
విజయ్ 69 (తెలుగు డబ్బింగ్ హిందీ చిత్రం)- నవంబర్ 8
ది బకింగ్ హమ్ మర్డర్స్ (హిందీ చిత్రం)- నవంబర్ 8
బ్యాక్ అండర్ సీజ్ (స్పానిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
ఇన్వెస్టిగేషన్ ఏలియన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
మిస్టర్ ప్లాంక్టన్ (కొరియన్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
ది కేజ్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
ఉంజోలో: ది గాన్ గర్ల్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 8
Mungkin Esok Lusa Atau Nanti (ఇండోనేషియన్ ఫిల్మ్)- నవంబర్ 8
జర్నల్ రైసా బై రైసా సరస్వతి- నవంబర్ 8
ఇట్ ఎండ్స్ విత్ అజ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 9
ఆర్కేన్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 9
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
సిటాడెల్: హనీ బన్నీ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 7
వేట్టయన్ (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)- నవంబర్ 8
గొర్రె పురాణం (తెలుగు మూవీ)- నవంబర్ 8
లుక్ బ్యాక్ (జపనీస్ యానిమేటెడ్ మూవీ)- నవంబర్ 8
అలెక్స్ రైడర్ సీజన్ 1-3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
అఫ్టర్‌మత్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమా)- నవంబర్ 8
ఫాక్స్‌క్యాచర్ (హాలీవుడ్ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 8
ది కరెంట్ వార్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 8
ఏఆర్ఎమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ మూవీ)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- నవంబర్ 8
జనక అయితే గనక (తెలుగు చిత్రం)- ఆహా ఓటీటీ- నవంబర్ 8
ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ (స్వీడిష్ ఫిల్మ్)- బుక్ మై షో- నవంబర్ 8
చీఫ్ ఆఫ్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ చిత్రం)- వీఆర్ ఓటీటీ (VROTT)- నవంబర్ 8
క్వాబోన్ కా జమెలా (హిందీ సినిమా)- జియో సినిమా ఓటీటీ- నవంబర్ 8
ఇలా ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 22 సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతోపాటు మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ చిత్రాలు వేట్టయాన్, ఏఆర్ఎమ్, జనక అయితే గనక ఉన్నాయి. ఇవే కాకుండా కరీనా కపూర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది బకింగ్ హమ్ మర్డర్స్, తెలుగు డబ్బింగ్ హిందీ చిత్రం విజయ్ 69 కూడా స్పెషల్‌గా ఉన్నాయి.
అలాగే, గొర్రె పురాణం కూడా చాలా స్పెషల్ చిత్రంగా చెప్పుకోవచ్చు. ఇలా 22 వాటిల్లో 7 మాత్రమే చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇందులోనూ ఆరు సినిమాలు, ఒకటి వెబ్ సిరీస్ ఉంది. దాదాపుగా ఈ సినిమాలన్నీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒక్క ది బకింగ్ హామ్ మర్డర్స్ తప్పా మిగతావన్నీ తెలుగులో ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.