Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 11 సినిమాలు- ఒక్కటి తప్ప 10 చాలా స్పెషల్- ఇంట్రెస్టింగ్‌గా 5 తెలుగులో- ఇక్కడ చూసేయండి!
Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఒక్కటి తప్పా 10 సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, అందులోనూ 5 తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సినిమాలన్నీ హారర్ యాక్షన్, ఫాంటసీ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ జోనర్స్‌లో ఉన్నాయి.
Today OTT Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ (జనవరి 17) ఒక్కరోజే 11 స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్, ఫాంటసీ సూపర్ నాచురల్ థ్రిల్లర్స్, కామెడీ ఇలా అన్ని రకాల జోనర్స్‌లో సినిమాలు ఉన్నాయి.
ఆహా ఓటీటీ
అన్‌స్టాపబుల్ సీజన్ 4 రామ్ చరణ్ ఎపిసోడ్ (తెలుగు టాక్ షో)- జనవరి 17
వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 17
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
బ్యాక్ ఇన్ యాక్షన్ (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్)- జనవరి 17
ది రోషన్స్ (హృతిక్ రోషన్ ఫ్యామిలీ డాక్యుమెంటరీ హిందీ సిరీస్)- జనవరి 17
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
పాతాల్ లోక్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 17
ఐ వాంట్ టు టాక్ (హిందీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జనవరి 17
హార్లీ క్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ యానిమేటెడ్ యాక్షన్ వెబ్ సిరీస్)- జియో సినిమా ఓటీటీ- జనవరి 17
హెల్‌బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ (హెల్‌బాయ్ 4) (హాలీవుడ్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జనవరి 17
విడుతలై పార్ట్ 2 (తమిళ యాక్షన్ డ్రామా మూవీ)- జీ5 ఓటీటీ- జనవరి 17
పవర్ ఆఫ్ పాంచ్ (హిందీ ఫాంటసీ సూపర్ నేచురల్ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 17
ఐయామ్ కథలన్ (మలయాళ కామెడీ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జనవరి 17
ఇవాళ ఓటీటీలో 11
ఇలా సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా ఇవాళ 11 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసిన బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఎపిసోడ్ చాలా స్పెషల్ కానుంది. అలాగే, విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ విడుదలకు సీక్వెల్ అయిన విడుతలై 2 కూడా ఇంట్రెస్టింగ్ చిత్రం అవనుంది. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇంట్రెస్టింగ్ సినిమాలు
వీటితోపాటు తెలుగు డబ్బింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పాతాల్ లోక్ సీజన్ 2, తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ హారర్ యాక్షన్ మూవీ హెల్‌బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్, హిందీ ఫాంటసీ సూపర్ నేచురల్ వెబ్ సిరీస్ పవర్ ఆఫ్ పాంచ్, మలయాళ కామెడీ సినిమా ఐయామ్ కథలన్, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ యాక్షన్ సినిమా ‘బ్యాక్ ఇన్ యాక్షన్’ కూడా చాలా స్పెషల్ కానున్నాయి.
పది చాలా స్పెషల్
అలాగే, తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్, మొన్నటివరకు రెంటల్ విధానంలో ఉండి ఫ్రీ స్ట్రీమింగ్‌కు వచ్చిన అభిషేక్ బచ్చన్ ఎమోషనల్ డ్రామా ఐ వాంట్ టు టాక్ కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలే. ఇలా ఈరోజు ఓటీటీ రిలీజ్ అయిన పదకొండింట్లో ఒక్క హార్లీ క్వీన్ సీజన్ 5 తప్పా ఏకంగా 10 చూసేందుకు చాలా స్పెషల్‌గానే ఉన్నాయి.
తెలుగులో 5
అలాగే, వీటిలో ఒకటి టాక్ షో, మరొటి డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ కాగా.. ఆరు సినిమాలు, 2 వెబ్ సిరీసులు ఉన్నాయి. వీటన్నింట్లో ఐదు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం