Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 6 సినిమాలు.. 2 తెలుగు మూవీస్ చాలా స్పెషల్.. ఇక్కడ చూసేయండి!-today ott movies in telugu allu arjun pushpa 2 the rule on netflix and direct ott release movie pothugadda in etv win ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Movies: ఓటీటీలోకి ఇవాళ 6 సినిమాలు.. 2 తెలుగు మూవీస్ చాలా స్పెషల్.. ఇక్కడ చూసేయండి!

Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 6 సినిమాలు.. 2 తెలుగు మూవీస్ చాలా స్పెషల్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Jan 30, 2025 11:16 AM IST

Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 6 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో రెండు తెలుగు సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అందులో అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్‌తోపాటు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ మూవీ ఉంది. మరి ఈ సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఇవాళ 6 సినిమాలు.. 2 తెలుగు మూవీస్ చాలా స్పెషల్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ 6 సినిమాలు.. 2 తెలుగు మూవీస్ చాలా స్పెషల్.. ఇక్కడ చూసేయండి!

Today OTT Movies Telugu: ఓటీటీలోకి ఎప్పటికప్పుడు ప్రతివారం సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌కు వస్తాయని తెలిసిందే. అలా ఈ వారం కూడా ఎన్నో చిత్రాలు, సిరీసులు ఓటీటీల్లో అలరించేందుకు రిలీజ్ అయ్యాయి. అయితే, ఇవాళ (జనవరి 30) ఒక్కరోజునే ఓటీటీలోకి 6 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి.

yearly horoscope entry point

వివిధ జోనర్స్‌లో

వాటిలో యాక్షన్, రివేంజ్, క్రైమ్, సైన్స్ ఫిక్షన్, కామెడీ, రొమాంటిక్ డ్రామా వంటి జోనర్స్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటీ.. అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

పుష్ప 2 ది రూల్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 30

ది రిక్రూట్ సీజన్ 2 (ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 30

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

యూ ఆర్ కోర్డియల్లీ ఇన్వైటెడ్ (ఇంగ్లీష్ కామెడీ చిత్రం)- జనవరి 30

ఫ్రైడే నైట్ లైట్స్ సీజన్ 5 (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్) -జనవరి 30

బ్రీచ్- (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- జనవరి 30

పోతుగడ్డ (తెలుగు రివేంజ్ థ్రిల్లర్ సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- జనవరి 30

ఓటీటీలో రెండు మాత్రమే స్పెషల్

ఇలా ఇవాళ (జనవరి 30) సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 6 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్‌గా రెండు తెలుగు సినిమాలే ఉండటం విశేషం. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్‌తోపాటు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన పోతుగడ్డ సినిమా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

పుష్ప 2 ది రూల్ ఓటీటీ

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా ఇవాళ నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అంతేకాకుండా థియేటర్లలో రిలీజ్ చేయని రీలోడెడ్ వెర్షన్ సీన్లతో నేడు పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీంతో పుష్ప 2 ది రూల్ రన్ టైమ్ మూడు గంటల 44 నిమిషాలుగా ఉండనుంది.

పోతుగడ్డ ఓటీటీ రిలీజ్

డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు రివేంజ్ థ్రిల్లర్ సినిమా పోతుగడ్డ. ఈటీవీ విన్‌లో నేటి నుంచి పోతుగడ్డ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. రాజకీయ చదరంగంలో చిక్కుకున్న ప్రేమజంట చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ సినిమాలో పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ, ఆడుకాలం నరేన్ ప్రధాన పాత్రలు పోషించగా.. పోతుగడ్డకు రక్ష వీరమ్ దర్శకత్వం వహించారు.

Whats_app_banner