Today OTT Releases: 2 ఓటీటీల్లో రెండ్రోజుల్లో 14 సినిమాలు స్ట్రీమింగ్.. 3 ఇంట్రెస్టింగ్.. ఎందులో అంటే?-today ott movies and web series release friday ott streaming movies on amazon prime ott and netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Today Ott Movies And Web Series Release Friday Ott Streaming Movies On Amazon Prime Ott And Netflix

Today OTT Releases: 2 ఓటీటీల్లో రెండ్రోజుల్లో 14 సినిమాలు స్ట్రీమింగ్.. 3 ఇంట్రెస్టింగ్.. ఎందులో అంటే?

Sanjiv Kumar HT Telugu
Mar 01, 2024 11:15 AM IST

Friday OTT Streaming Movies: ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీసులు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అయితే రెండు ఓటీటీల్లో రెండ్రోజుల్లోనే సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 14 విడుదల అయ్యాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

2 ఓటీటీల్లో రెండ్రోజుల్లో 14 సినిమాలు స్ట్రీమింగ్.. 3 ఇంట్రెస్టింగ్.. ఎందులో అంటే?
2 ఓటీటీల్లో రెండ్రోజుల్లో 14 సినిమాలు స్ట్రీమింగ్.. 3 ఇంట్రెస్టింగ్.. ఎందులో అంటే?

OTT Releases On This Friday: మూవీ లవర్స్ ఎదురుచూసినదానికంటే వేగంగా ప్రతివారం వచ్చేస్తోంది. ఎవ్రీ వీక్ రావడం మాత్రమే కాకుండా సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులను ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తీసుకొస్తున్నాయి. గతవారం చిత్రాలు, సిరీసులు ఇంకా పెండింగ్‌లో ఉండగానే కొత్త సినిమాలు వచ్చి సందడి చేస్తున్నాయి. అయితే, ఈ వారం థియేటర్లలో చిన్న తెలుగు సినిమాలు రిలీజ్ కానుండగా ఓటీటీలో మాత్రం తమిళ డబ్బింగ్, డాక్యుమెంటరీ సిరీస్‌లు సందడి చేయనున్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ

బ్లూ స్టార్ (తమిళ సినిమా)- ఫిబ్రవరి 29 (ఆల్రెడీ స్ట్రీమింగ్)

పా పాట్రోల్: ది మైటీ మూవీ (ఇంగ్లీష్ సినిమా)- ఫిబ్రవరి 29 (ఆల్రెడీ స్ట్రీమింగ్)

రెడ్ క్వీన్ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 29 (ఆల్రెడీ స్ట్రీమింగ్)

నైట్ స్విమ్ (ఇంగ్లీష్ చిత్రం)- మార్చి 1 (ఆల్రెడీ స్ట్రీమింగ్)

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మన్ సూయాంగ్ (థాయ్ మూవీ)- ఫిబ్రవరి 29

ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 29

ఫ్యూరిస్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 29

ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ డాక్యుమెంటరీ-4 ఎపిసోడ్స్)- మార్చి 1

మామ్లా లీగల్ హై (హిందీ, తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్)- మార్చి 1

మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ (కొరియన్ వెబ్ సిరీస్)- మార్చి 1

షేక్, ర్యాటెల్ అండ్ రోల్: ఎక్స్‌ట్రీమ్ (తగలాగ్ సినిమా)- మార్చి 1

సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 1

స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం)- మార్చి 1

ది పిగ్ ది స్నేక్ అండ్ ది పిజియన్ (మాండరిన్ మూవీ)- మార్చి 1

ది నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 03

ఇలా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ రెండు ఓటీటీల్లో రెండ్రోజుల్లో కలిపి మొత్తంగా 14 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఫిబ్రవరి 29న 6, మార్చి 1న 8 సినిమాలు స్ట్రీమింగ్‌కు అవుతున్నాయి. అంటే ఎక్కువగా ఇవాళ అంటే శుక్రవారం (మార్చి 1) నాడు ఎక్కువ సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల అయ్యాయి. వీటిలో ఇంద్రానీ ముఖర్జీ స్టోరీ, మామ్లా లీగల్ హై, క్రికెట్ నేపథ్యంలో వచ్చిన బ్లూ స్టార్ ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి.

IPL_Entry_Point