Tillu Square Box Office Collection: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మరోసారి తన మార్క్ చూపించిన సినిమా టిల్లు స్క్వేర్. రెండు రోజుల క్రితం గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. రెండు రోజుల్లో భారీగానే కలెక్షన్స్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 9.25 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు మాత్రం కాస్తా తక్కువగా రూ. 7.36 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది.
టిల్లు స్క్వేర్ సినిమా రెండో రోజు నైజాం ఏరియాలో రూ. 3.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 96 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 91 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 38 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 24 లక్షలు, గుంటూరులో రూ. 37 లక్షలు, కృష్ణలో రూ. 35 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలు వసూలు చేసింది. ఇలా రెండో రోజు మూవీకి రూ. 7.36 కోట్ల షేర్, రూ. 12.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండు రోజులకు కలిపి ఏపీ, తెలంగాణలో రూ. 16.61 కోట్ల షేర్, రూ. 25.50 కోట్ల గ్రాస్ రాబట్టింది.
వాటిలో నైజాం నుంచి రూ. 8.32 కోట్లు, సీడెడ్-2 కోట్లు, ఉత్తరాంధ్ర-2.15 కోట్లు, ఈస్ట్ గోదావరి-1.13 కోట్లు, వెస్ట్ గోదావరి-67 లక్షలు, గుంటూరు-93 లక్షలు, కృష్ణ-84 లక్షలు, నెల్లూరు-57 లక్షలుగా ఉన్నాయి. అలాగే కర్ణాటకతోపాటు మిగతా రాష్ట్రాల నుంచి రూ. 1.40 కోట్లు టిల్లు స్క్వేర్ సినిమాకు వచ్చాయి. ఓవర్సీస్ నుంచి రూ. 7.10 కోట్లు రాబట్టింది ఈ మూవీ. ఇలా వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల్లో చిత్రానికి రూ. 25.11 కోట్ల షేర్, రూ. 45.3 కోట్ల గ్రాస్ రాబట్టింది.
కాగా టిల్లు స్క్వేర్ సినిమాకు ఓవరాల్‌గా రూ. 27 కోట్ల బిజినెస్ అయింది. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28 కోట్లుగా ఉంది. సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 25.11 కోట్లు రావడంతో ఇంకా రూ. 2.89 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి అవుతుంది. ఈ టార్గెట్‌ను మూడో రోజున చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత సినిమాకు అన్ని లాభాలే. ఇప్పటికే 45 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ నిర్మాత నాగవంశీ చెప్పినట్లు 100 కోట్లు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి లాంగ్ రన్‌లో టిల్లు స్క్వేర్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో.
టాపిక్