Tiger Nageswara Rao concept video: పులుల్ని వేటాడే పులిని చూశారా.. టైగర్ నాగేశ్వర రావు కాన్సెప్ట్ వీడియో అదుర్స్-tiger nageswara rao concept video and ravi teja first look revealed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tiger Nageswara Rao Concept Video And Ravi Teja First Look Revealed

Tiger Nageswara Rao concept video: పులుల్ని వేటాడే పులిని చూశారా.. టైగర్ నాగేశ్వర రావు కాన్సెప్ట్ వీడియో అదుర్స్

Hari Prasad S HT Telugu
May 24, 2023 03:49 PM IST

Tiger Nageswara Rao concept video: పులుల్ని వేటాడే పులిని చూశారా.. టైగర్ నాగేశ్వర రావు కాన్సెప్ట్ వీడియో అదుర్స్ అనిపించేలా ఉంది. రవితేజ ఫస్ట్ లుక్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

టైగర్ నాగేశ్వర రావు మూవీలో రవితేజ
టైగర్ నాగేశ్వర రావు మూవీలో రవితేజ

Tiger Nageswara Rao concept video: ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మరో పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ మధ్య విలన్లను హీరోలుగా చూపించే సినిమాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ మూవీ కూడా ఇండియాలోనే అతి పెద్ద దొంగ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. స్టువర్ట్ పురంలో ఒకప్పుడు గడగడలాడించిన టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ నటించాడు.

తాజాగా ఈ మూవీ నుంచి బుధవారం (మే 24) రవితేజ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియో రిలీజైంది. కార్తికేయ 2, ది కశ్మీర్ ఫైల్స్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానరే ఈ సినిమాను తెరకెక్కించింది. ఈ తాజాగా వీడియోను కూడా చాలా పవర్‌ఫుల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రాజమండ్రిలోని హ్యావెలాక్ బ్రిడ్జ్ పై ఈ మూవీ కాన్సెప్ట్ వీడియోలో రిలీజ్ చేయడం విశేషం.

దీనికోసమే ప్రత్యేకంగా ఓ రైలును కూడా అద్దెకు తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ వీడియోతోపాటు ఫస్ట్ లుక్ లో రవితేజ కూడా అసలుసిసలు టైగర్ లా ఉన్నాడు. మూవీ తెరకెక్కుతున్న స్టువర్ట్‌పురంలోని టైగర్ నాగేశ్వర రావు గురించి చెబుతూ ఈ కాన్సెప్ట్ వీడియో సాగుతుంది. ఈ సందర్భంగా సౌతిండియా క్రైమ్ క్యాపిటల్ గా స్టువర్ట్‌పురంను పరిచయం చేశారు.

మేకల్ని వేటాడు పులులను చూసుంటారు.. కానీ పులుల్నే వేటాడే పులిని చూశారా అనే రవితేజ డైలాగ్ తో ఈ వీడియో ముగుస్తుంది. కానీ కాన్సెప్ట్ వీడియలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ వీడియోకు తెలుగులో వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇక హిందీలో జాన్ అబ్రహాం, కన్నడలో శివ రాజకుమార్, తమిళంలో కార్తీ, మలయాళంలో దుల్కర్ సల్మాన్ లు వాయిస్ అందించారు.

ఈ ఐదు భాషల్లో టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కాబోతోంది. 1970ల్లో స్టువర్ట్‌పురంలో ఇండియాలోనే అతిపెద్ద దొంగగా పేరుగాంచిన వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఇది. చీకటి కూడా ఆ ఊరి వాళ్లను చూసి జడుసుకుంటుందంటూ వాయిస్ ఓవర్ సాగుతుంది. దానినే టైగర్ జోన్ అని కూడా పిలుస్తారని చెబుతారు. ఈ మూవీ అక్టోబర్ 20న రిలీజ్ కానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం