Bigg Boss Telugu 6 Episode 87: హౌస్‌లో టికెట్ టూ ఫినాలే టాస్క్.. తొలి రౌండులోనే శ్రీసత్య ఔట్.. రేవంత్ స్ట్రిక్ట్-ticket to finale task at bigg boss telugu 6 latest episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ticket To Finale Task At Bigg Boss Telugu 6 Latest Episode

Bigg Boss Telugu 6 Episode 87: హౌస్‌లో టికెట్ టూ ఫినాలే టాస్క్.. తొలి రౌండులోనే శ్రీసత్య ఔట్.. రేవంత్ స్ట్రిక్ట్

Maragani Govardhan HT Telugu
Nov 30, 2022 06:40 AM IST

Bigg Boss Telugu 6 Episode 87: బిగ్‌బాస్ సీజన్ 6 13వ వారానికి చేరుకుంది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్‌కు బిగ్‌బాస్ టికెట్ టూ ఫినాలే టాస్క్ ఇచ్చారు. ఇందులో బాగంగా తొలి రెండు రౌండులోనే శ్రీసత్య, ఇనాయా, కీర్తి రేసు నుంచి వైదొలిగారు.

బిగ్‌బాస్ 6 టికెట్ టూ ఫినాలే టాస్క్
బిగ్‌బాస్ 6 టికెట్ టూ ఫినాలే టాస్క్

Bigg Boss Telugu 6 Episode 87: సోమవారం నామినేషన్ల ఎపిసోడ్‌తో రసవ్తతరంగా మారిన బిగ్‌బాస్ హౌస్.. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో టికెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. హౌస్ మేట్స్ అంతా ఈ ఛాన్స్ దక్కించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నామినేషన్లు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ నామినేషన్ల గురించి చర్చ మొదలుపెట్టేశారు. ముందుగా రేవంత్ గురించి ఆదిరెడ్డి ఫైమాతో చర్చిస్తాడు. అనంతరం బాత్రూమ్‌లో కీర్తి, శ్రీసత్యతోనూ ఇదే విషయంపై మాట్లాడతాడు. రేవంత్ తను చేసిన తప్పును అస్సలు ఒప్పుకోడు అని చెబుతాడు.

మరోపక్క రేవంత్.. ఫైమా ప్రవర్తన గురించి మాట్లాడుతుంటాడు. ఫైమా శ్రీహాన్‌తో రేవంత్ గురించి చెబుతుంది. అతడు చేసిన తప్పులను అస్సలు చూపించరంటూ స్పష్టం చేసింది. నేను వేలు చూపిస్తేనే అంత కోపం వచ్చింది.. అతడు తన మాటలను మాత్రం అదుపులో పెట్టుకోడు అంటూ చిన్నబుచ్చుకుంది. శ్రీసత్యతో రేవంత్ ఫైమా గురించి చెబుతూ.. తన గురించి ఏం చెప్పలేదంటారు.. ఫస్ట్ వీక్‌లోనే రేవంత్ నువ్వు బూతులు మాట్లాడుతున్నావు కంట్రోల్‌లో పెట్టుకో అని చెప్పారు.. అలా అంటే అందరికంటే ఎక్కువ సార్లు వీకెండ్‌లో నాపేరే వినిపించింది అంటూ తన గురించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తాడు.

ఈలోగా బిగ్‌బాస్.. టికెట్ టూ ఫినాలే టాస్క్‌ను ఇస్తారు. సమయానుసారి వచ్చే వస్తువులతో స్నోమేన్‌ను(బొమ్మ) నిర్మించాలి. రౌండు ముగిసే సమయానికి ఎవరైతే తక్కువ వస్తువులతో స్నోమెన్‌ను నిర్మిస్తారో వారు టాస్క్ నుంచి తొలగిపోతారు అంటూ బిగ్‌బాస్ ఆదేశిస్తారు. ఈ టాస్క్‌కు సంచాలక్‌గా ఇనాయాను నియమిస్తారు. తను ఆటలో ఆడుతూ.. సంచాలక్‌గానూ ఉంటుంది. మొదటి దశలో రేవంత్, ఆదిరెడ్డి ఎక్కువ వస్తువులను తీసుకుని స్నోమేన్‌ను నిర్మిస్తారు. అయితే ఇదే సమయంలో వస్తువులను రోహిత్, ఫైమా, కీర్తి వస్తువులను తమ వద్దే ఉంచుకున్న కారణంగా వారిని నియంత్రించడంలో విఫలమైనందుకు ఇనాయాను సంచాలక్‌గా తొలగించి రేవంత్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తాడు బిగ్‌బాస్.

రేవంత్-శ్రీసత్య వాదన..

రేవంత్ సంచాలక్‌గా వచ్చి రావడంతోనే తన కఠిన నియమాలను మరోసారి హౌస్ మేట్స్‌పై రుద్దుతాడు. స్నోమేన్ సరిగ్గా నిర్మించని వాళ్లు వైదొలుగుతారా అని సత్య ప్రశ్నించగా.. కాదు తక్కువ ఉంటాయో వారు వైదొలుగుతారు అని రేవంత్ క్లారిటీ ఇస్తాడు. ఈ విషయంలో వీరిద్దరికీ చిన్నపాటి వాదన జరుగుతుంది. అనంతరం శ్రీసత్య విరిగిన వస్తువుతో బొమ్మను నిర్మిస్తుంటే.. విరిగితే దాన్ని కౌంట్ చేయను అని ఆమెతో అంటాడు. అదేంటి.. విరిగినట్లు నీకు కనిపించట్లేదుగా అని సత్య ప్రశ్నించగా.. బొమ్మను ముందుభాగంలో నువ్వు కవర్ చేశావ్.. వెనక భాగంలో క్లారిటీగా కనిపిస్తుందని చెప్పగా.. ఇలా చేయడం కరెక్ట్ కాదు అని సత్య వాదిస్తుంది. సంచాలక్‌గా ఇవి రూల్స్ విరిగిన వస్తువు కౌంట్ చేయను అని గట్టిగా చెప్పాడు. అయితే నువ్వు కౌంట్ చేయవద్దు. నేను ఊరికే పెట్టుకుంటాను బదులిచ్చింది.

అనంతరం బిగ్‌బాస్ ఆదేశంతో ఒకరిని తొలగించాలని రేవంత్‌కు చెప్పగా.. అందరికంటే తక్కువ వస్తువులున్న శ్రీసత్యను అతడు టాస్క్ నుంచి ఎలిమినేట్ చేస్తాడు. అనంతరం రెండో లెవల్ మొదలవుతుంది. ఇందులో భాగంగా స్టార్ట్-ఎండ్ బజర్ల మధ్య ఉన్న సమయంలో ఇతరుల బొమ్మలపై ఎటాక్ చేయవచ్చు, చేసి వీలైనన్ని వస్తువులను దొంగిలించవచ్చని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. పరోక్షంగా ఒకరినొకరు దాడి చేసుకోమని చెప్పినప్పటికీ.. హౌస్ మేట్స్ మాత్రం ఇతరుల బొమ్మల జోలికి వెళ్లలేదు. తమ బొమ్మలను మాత్రమే కాపాడే ప్రయత్నం చేశారు.

ఇనాయా మాత్రం శ్రీహాన్‌ నుంచి బొమ్మలను తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఈ దాడిని బిగ్‌బాస్ షో ఎడిటర్ వేరే విధంగా చూపించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్లు చూపించారు. ఇందుకు శ్రీసత్య కూడా వంత పాడటంతో వినోదం పండింది. ఒకర్నొకరు లాక్కోవడం, పట్టుకోవడం లాంటివి రొమాంటిక్‌గా చూపించారు. ఇదిలా ఉంటే శ్రీసత్య మాత్రం ఈ విషయాన్ని ఇంకా హైలెట్ చేసింది. వీరిద్దరి దగ్గరకు వెళ్లి మీరిద్దరూ ఏం చేశారు? అని అడిగేసింది. ఇందుకు ఇనాయా సిగ్గుపడుతూ ఎటాక్ చేశాను అని చెప్పగా.. అది ఎటాక్‌లా లేదు.. కావాలంటే టెలికాస్ట్‌లో చూసుకోండి.. అంటూ శ్రీసత్య చెప్పింది. మరోపక్క శ్రీహాన్‌తో ఇనాయాతో బాగానే చేశావే.. నువ్వు హ్యాపీనే కదా..అని శ్రీహాన్‌ను ఆటపట్టించింది. అంతటితో ఆగకుండా వీరిద్దరూ ఎలా చేశారో రేవంత్, పైమాలు ఇమిటేట్ చేసి చూపించారు. ఒక్క లాగు లాగితే ఆ అమ్మాయి వచ్చేస్తుంది. కానీ శ్రీహాన్ అలాగే పట్టుకుని ఉన్నాడు. అంటూ స్పష్టం చేసింది. అంతేకాకుండా మగధీర సినిమాతో పోలికలు పెట్టాడు శ్రీహాన్. సత్య .. మిత్రవింద అని.. ఇనాయా ఐటెమ్ గర్ల్ అని చెప్పగా.. ఇందుకు ఇనాయా బుంగమూతి పెడుతుంది. దీంతో శ్రీహాన్.. ఇనాయానే మిత్రవింద.. సత్య ఐటెమ్ గర్ల్ అంటూ తెలిపాడు.

అనంతరం బిగ్‌బాస్ ఆదేశంతో మొదటి రౌండులో అనర్హతకు గురైన శ్రీసత్యను సంచాలక్‌గా నియమించారు. దీంతో శ్రీసత్య వచ్చి రావడంతోనే రేవంత్ పెట్టిన రూల్స్ మార్చేసింది. రెండో లెవల్‌లో ఇద్దరిని తొలగించాలని చెప్పడంతో అందరి కంటే తక్కువ బొమ్మలున్న ఇనాయ, కీర్తి వైదొలుగుతారు.

IPL_Entry_Point

టాపిక్