Thriller Web Series Season 2: థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది.. టీజర్ చూశారా?
Thriller Web Series Season 2: సూపర్ హిట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది. ఈ కొత్త సీజన్ అనౌన్స్ చేస్తూ సోనీలివ్ ఓటీటీ బుధవారం (జులై 3) టీజర్ కూడా రిలీజ్ చేసింది.

Thriller Web Series Season 2: ప్రముఖ ఓటీటీ సోనీలివ్ లో రెండేళ్ల కిందట వచ్చిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ తనావ్. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ కూడా రాబోతోంది. సుధీర్ మిశ్రా, ఇ.నివాస్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ టీజర్ ను బుధవారం (జులై 3) సోనీలివ్ రిలీజ్ చేసింది. ఇజ్రాయెల్లో వచ్చిన టీవీ సిరీస్ ఫౌదా ఆధారంగా తెరకెక్కిన సిరీస్ ఇది.
తనావ్ వెబ్ సిరీస్ సీజన్ 2 టీజర్
ఓటీటీలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ రాబోతోంది. తనావ్ పేరుతో రెండేళ్ల కిందట వచ్చిన సిరీస్ తొలి సీజన్ సక్సెస్ కాగా.. ఇప్పుడు టీజర్ తో రెండో సీజన్ అనౌన్స్ చేశారు. రెండో సీజన్ కూడా అంతే థ్రిల్లింగా సాగనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. మానవ్ విజ్ నటించిన ఈ సిరీస్ రిలీజ్ తేదీని మేకర్స్ అనౌన్స్ చేయాల్సి ఉంది.
రెండో సీజన్ ఐసిస్ ఉగ్రవాదం, దానివల్ల దేశం ఎదుర్కోబోయే సవాళ్ల చుట్టూ తిరగనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. "తర్వాత ఏం జరగబోతోంది? ఇందులో ఉన్న వారి పరిస్థితి ఏం కానుంది? సాహసం, అత్యాశ, ప్రేమ, ప్రతీకారం, మోసం చుట్టూ తిరిగే స్టోరీలతో రానున్న యాక్షన్ ప్యాక్ట్ వెబ్ సిరీస్ తనావ్ సీజన్ 2. అవార్డు విన్నింగ్ సుధీర్ మిశ్రా, నివాస్ డైరెక్ట్ చేశారు" అనే క్యాప్షన్ తో సోనీలివ్ ఈ విషయాన్ని వెల్లడించింది.
తనావ్ ఫస్ట్ సీజన్ ఇలా..
తనావ్ వెబ్ సిరీస్ లో మానవ్ విజ్ తోపాటు రజత్ కపూర్, గౌరవ్ అరోరా, అర్బాజ్ ఖాన్, శశాంక్ అరోరా, సత్యదీప్ మిశ్రా నటించారు. ఈ సిరీస్ లీడ రోల్ మానవ్ విజ్ తొలి సీజన్లో కబీర్ ఫరూఖీ అనే స్పెషల్ టాస్క్ గ్రూప్ సభ్యుడి పాత్ర పోషించాడు. తనావ్ సీజన్ 1కు ఐఎండీబీలో 7.6 రేటింగ రావడం విశేషం. ఏడాదిన్నర కిందట వచ్చిన తొలి సీజన్లో మొత్తం 12 ఎపిసోడ్లు ఉన్నాయి.
తొలి సీజన్ మొత్తం పాకిస్థాన్ ఉగ్రవాదులు, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ గ్రూప్ మధ్య యుద్ధం చుట్టే తిరుగుతుంది. ఈ రెండో సీజన్లో ఈ గ్రూప్ కు ఐసిస్ ఉగ్రవాదుల నుంచి సవాలు రానున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఓ ఐసిస్ ఉగ్రవాది కశ్మీర్ లోయలో మానవబాంబుగా మారి పేలుడు సృష్టించినట్లు టీజర్లో చూపించారు.