థ్రిల్లర్ మూవీ అభిమానుల కోసం ఈ వీకెండ్ మరో సినిమా సిద్ధంగా ఉంది. ఇదో హిందీ మూవీ. మే 23న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా పేరు పుణె హైవే. ఐఎండీబీలో 8.1 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని భావించారు.
ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే థ్రిల్లర్ మూవీ పుణె హైవే శుక్రవారం (జులై 4) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మే 23న సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా.. సుమారు 40 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ అయింది.
థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు సడెన్ గా ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎలాంటి ముందస్తు సమాచారం లేదు.
పుణె హైవే ఓ హిందీ థ్రిల్లర్ మూవీ. జిమ్ సర్బ్, అమిత్ సాధ్ లాంటి వాళ్లు ఇందులో నటించారు. భార్గవ కృష్ణ, రాహుల్ కన్హ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. గతేడాది నవంబర్లోనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మూవీని ప్రదర్శించగా.. మే 23న థియేటర్లలో రిలీజైంది. స్నేహం, హత్య చుట్టూ తిరిగే థ్రిల్లర్ సినిమా ఇది.
ముగ్గురు స్నేహితులు ముంబైలోని ఒకే భవనంలో పెరిగి పెద్దవుతారు. వాళ్ల మధ్య మంచి స్నేహం ఉంటుంది. అయితే వాళ్లకు 200 కి.మీ. దూరంలోని ఓ చెరువులో దొరికే ఓ మృతదేహం వాళ్ల జీవితాలను మార్చేస్తుంది. అసలు ఆ హత్యకు వీళ్లకు సంబంధం ఏంటి? వాళ్ల స్నేహం నిలుస్తుందా? ఆ హత్య మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే పుణె హైవే మూవీ చూడాలి.
సంబంధిత కథనం