OTT Thriller Movie: థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారి కోసం ఇప్పుడో హైస్ట్ థ్రిల్లర్ ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ పేరు జువెల్ థీఫ్ - ది హైస్ట్ బిగిన్స్. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, జైదీప్ అహ్లావత్ నటిస్తున్నారు. శుక్రవారం (మార్చి 28) మేకర్స్ ఈ మూవీ కొత్త పోస్టర్ తోపాటు రిలీజ్ తేదీని అనౌన్స్ చేశారు.
మరో బాలీవుడ్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. జువెల్ థీఫ్ ది హైస్ట్ బిగిన్స్ మూవీ ఏప్రిల్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కూకీ గులాటీ, రాబీ గ్రేవాల్ డైరెక్ట్ చేసిన ఈ హైస్ట్ థ్రిల్లర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ఓ మోసగాడి పాత్రలో నటిస్తుండగా.. జైదీప్ అహ్లావత్ ఓ మాఫియా బాస్ పాత్ర పోషిస్తున్నాడు. కునాల్ కపూర్, నికితా దత్తాలాంటి వాళ్లు కూడా ఇందులో నటిస్తున్నారు.
ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని శుక్రవారం (మార్చి 28) నెట్‌ఫ్లిక్స్ తన ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా వెల్లడించింది. “రిస్క్ ఎంత పెద్దదైతే అంత పెద్ద దోపిడీ జరుగుతుంది. అద్భుతమైన జువెల్ థీఫ్ వచ్చేస్తున్నాడు. జువెల్ థీఫ్ ఏప్రిల్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ఓ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.
జువెల్ థీఫ్ మూవీని ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. గతంలో ఎన్నో యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ను అతడు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను బుడాపెస్ట్, ఇస్తాంబుల్, ముంబైలాంటి నగరాల బ్యాక్‌డ్రాప్ లో చిత్రీకరించారు. ఈ సినిమాపై సైఫ్ అలీ ఖాన్ స్పందించాడు. సిద్ధార్థ్ ఆనంద్ తో మరోసారి చేతులు కలపడం చాలా ఆనందంగా ఉందని అతడు చెప్పాడు. మూవీలో జైదీప్ అహ్లావత్ ఉండటం దీనిని మరింత ఎక్సైటింగా మార్చినట్లు తెలిపాడు.
అటు జైదీప్ అహ్లావత్ కూడా ఈ సినిమాపై స్పందించాడు. ఈ సినిమా ద్వారా ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడం గొప్ప అనుభవమని అన్నాడు. దోపిడీతో కూడిన థ్రిల్లర్ మూవీస్ లో నటించాలని చాలా రోజులుగా అనుకుంటున్నానని, ఈ సినిమా ద్వారా అది నెరవేరినట్లు తెలిపాడు. జువెల్ థీఫ్ ది హైస్ట్ బిగిన్స్ మూవీ ఏప్రిల్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం