OTT Malayalam Releases in April: ఏప్రిల్లో ఓటీటీలోకి రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మలయాళం మూవీస్ ఇవే.. థ్రిల్లర్స్ కూడా..
OTT Malayalam Releases in April: ఓటీటీలోకి ఏప్రిల్ నెలలో కొన్ని ఇంట్రెస్టింగ్ మోస్ట్ అవేటెడ్ మలయాళం మూవీస్ రాబోతున్నాయి. ఇవి నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్, జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెట్టనున్నాయి.
OTT Malayalam Releases in April: మలయాళం సినిమాలకు క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ ఇండస్ట్రీ నుంచి ఓటీటీలోకి అడుగుపెట్టే మూవీస్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఏప్రిల్ నెలలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు రాబోతున్నాయి. మరి వాటిని ఎప్పుడు, ఎక్కడ చూడాలో ఒకసారి చూద్దాం.
ఈమధ్య మంచి ఊపు మీద ఉన్న బాసిల్ జోసెఫ్ నటించిన ప్రవీణ్‌కూడు షాపు సోనీ లివ్‌లో ఓటీటీ లో విడుదల కానుంది. మమ్ముట్టి నటించిన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్, వినీత్ శ్రీనివాసన్ నటించిన ఒరు జాతి జాతకం మార్చిలో ఓటీటీ లో విడుదల కాకపోవడంతో ఏప్రిల్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రవీణ్‌కూడు షాపు - సోనీ లివ్
మార్చిలో ఓటీటీలోకి వచ్చిన పొన్‌మ్యాన్ మూవీలో నటనకు ప్రశంసలు అందుకుంటున్న బాసిల్ జోసెఫ్.. ఈ ప్రవీణ్‌కూడా షాపు మూవీలో పోలీసు పాత్రలో నటించాడు. కల్లు దుకాణంలో దాని యజమాని మరణం, దానిపై సాగే దర్యాప్తు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్ కూడా నటించారు. ఈ ప్రవీణ్‌కూడు షాపు మూవీ సోనీ లివ్ ఓటీటీలో ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్‌లో మమ్ముట్టి ఒక సాధారణ కేసును తీసుకునే డిటెక్టివ్‌గా నటించాడు. కానీ అతను లోతుగా తవ్వే కొద్దీ, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి. గౌతమ్ వాసుదేవ్ మేనన్ డైరెక్ట్ చేసిన తొలి మలయాళం మూవీ ఇది. డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మార్చిలో ప్రైమ్ వీడియోలో విడుదల అవుతుందని వార్తలు వచ్చినప్పటికీ, అది ఇంకా OTT లో విడుదల కాలేదు. ఏప్రిల్లో వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
బ్రోమాన్స్
బ్రోమాన్స్ ఓ ఇంట్రెస్టింగ్ మలయాళం మూవీ. మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్ లతోపాటు సంగీత్ ప్రతాప్, మహిమ నంబియార్, శ్యామ్ మోహన్ కలిసి నటించిన ఈ మూవీ.. ఓ సరదాగా సాగిపోయే కథ. తమ ఒకరు కనిపించకుండా పోయిన తర్వాత అందరూ ఒకచోట చేరే కొందరు యువతీయువకుల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. వీళ్లందరూ కలిసి కూర్గ్ వెళ్లేటప్పుడు కళాభవన్ షాజోన్ కూడా వారితో చేరతాడు. ఈ సినిమాలోని కొడవా వెడ్డింగ్ సాంగ్ జనరేషన్ జెడ్ ప్రేక్షకులలో బాగా పాపులర్ అయింది.
ఎన్ను స్వంతం పుణ్యలన్
అర్జున్ అశోకన్, బాలు వర్గీస్, అనస్వర రాజన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఈ ముగ్గురి చుట్టూనే తిరిగే కథ. ఓ చర్చి ఫాదర్, ఓ యువతి, ఓ దొంగ.. ఇలా ఈ ముగ్గురూ కలిసినప్పుడు జరిగే సన్నివేశాల చుట్టూ సినిమా సాగుతుంది. ఈ మూవీ జనవరి 10నే థియేటర్లలో రిలీజైంది. ఏప్రిల్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
దవీద్
ఆంటోనీ వర్గీస్ ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమాలో ఆషిక్ అబుగా నటించాడు. అతను టర్కిష్ బాక్సర్‌ను ఎదుర్కొంటాడు. తొలిసారిగా గోవింద్ విష్ణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సైజు కురుప్, మో ఇస్మాయిల్, విజయరాఘవన్, జెస్ కుక్కు, లిజోమోల్ జోస్ కీలక పాత్రల్లో నటించారు.
గెట్-సెట్ బేబీ
మార్కో వంటి థ్రిల్లర్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత ఉన్ని ముకుందన్.. నిఖిలా విమల్‌తో కలిసి గెట్-సెట్ బేబీ అనే ఫ్యామిలీ డ్రామాను తీశాడు. ఈ సినిమా ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ అర్జున్ బాలకృష్ణన్ జీవితం చుట్టూ తిరుగుతుంది. కానీ ఈ సినిమా థియేటర్లలో పెద్దగా అలరించలేదు. ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఏప్రిల్లో ఓటీటీలోకి అడుగుపెట్టొచ్చు.
సంబంధిత కథనం