OTT Telugu: ఓటీటీల్లో ఈ వారం తెలుగులో రానున్న మూడు సినిమాలు.. ఫ్యాంటసీ, హిస్టారికల్, థ్రిల్లర్ జానర్లలో.. ఒకటి నేరుగా..-three movies in telugu to release in ott platforms barroz razakar wife off on hotstar aha etv win latest films streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu: ఓటీటీల్లో ఈ వారం తెలుగులో రానున్న మూడు సినిమాలు.. ఫ్యాంటసీ, హిస్టారికల్, థ్రిల్లర్ జానర్లలో.. ఒకటి నేరుగా..

OTT Telugu: ఓటీటీల్లో ఈ వారం తెలుగులో రానున్న మూడు సినిమాలు.. ఫ్యాంటసీ, హిస్టారికల్, థ్రిల్లర్ జానర్లలో.. ఒకటి నేరుగా..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 21, 2025 12:13 PM IST

OTT Telugu Movies: ఓటీటీల్లో ఈ వారం తెలుగులో మూడు చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో వస్తున్నాయి. ఇందులో ఓ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఆ మూడు చిత్రాలు ఏవంటే..

OTT Telugu: ఓటీటీల్లో ఈ వారం తెలుగులో రానున్న మూడు సినిమాలు.. ఫ్యాంటసీ, హిస్టారికల్, థ్రిల్లర్ జానర్లలో.. ఒకటి నేరుగా..
OTT Telugu: ఓటీటీల్లో ఈ వారం తెలుగులో రానున్న మూడు సినిమాలు.. ఫ్యాంటసీ, హిస్టారికల్, థ్రిల్లర్ జానర్లలో.. ఒకటి నేరుగా..

ఓటీటీల్లో కొత్తగా ఈ వారం కూడా కొన్ని సినిమాలు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. వివిధ జానర్లలో చిత్రాలు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ జనవరి నాలుగో వారంలో ఓటీటీల్లో వచ్చేవాటిలో తెలుగులో మూడు సినిమాలు ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. ఫ్యాంటసీ, హిస్టారికల్, థ్రిల్లర్ జానర్ల చిత్రాలు అడుగుపెట్టనున్నాయి. ఈ వారంలో ఓటీటీల్లోకి తెలుగు రానున్న మూడు ఇంట్రెస్టింగ్ చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

yearly horoscope entry point

బరోజ్

ఫ్యాంటసీ యాక్షన్ సినిమా బరోజ్ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఈ చిత్రం రేపు జనవరి 22న డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. మలయాళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఎంట్రీ ఇవ్వనుంది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ ప్రధాన పాత్ర పోషించటంతో పాటు ఈ బరోజ్ మూవీకి దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రం గత డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. సుమారు రూ.150కోట్ల బడ్జెట్‍తో మలయాళంలో ఖరీదైన చిత్రం నిలిచింది. అయితే రూ.20కోట్లలోపు కలెక్షన్లతో చితికిలపడి డిజాస్టర్‌గా నిలిచింది. డిఫరెంట్‍గా ఉండే ఈ బరోజ్ చిత్రాన్ని రేపటి నుంచి హాట్‍స్టార్ ఓటీటీలో తెలుగులో కూడా చేసేయవచ్చు.

రజాకార్

రాజాకార్ చిత్రం థియేటర్లలో రిలీజైన సుమారు 10 నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ జనవరి 24వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆహా గోల్డ్ సబ్‍స్కైబర్లకు రెండు రోజుల ముందుగానే అందుబాటులోకి వస్తుంది. నిజాంల కాలంలో పాలకుల దురాగతాలు, ప్రజల తిరుగుబాటు అంశాలతో పీరియడ్ మూవీగా రజాకార్ తెరకెక్కింది.

రజాకార్ చిత్రం 2024 మార్చి 15న థియేటర్లలో రిలీజైంది. అయితే ఓటీటీలోకి వచ్చేందుకు ఆలస్యమవూ వచ్చింది. ఇప్పుడు 10 నెలల తర్వాత ఆహా ఓటీటీలో జనవరి 24న స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, మకరంద్ దేశ్‍పాండే, అనసూయ భరద్వాజ్, తేజ్ సర్పు, ఇంద్రజ ముఖ్మమైన రోల్స్ చేశారు. ఈ వారం ఓటీటీల్లో చూసేందుకు రజాకార్ చిత్రం కూడా మంచి ఆప్షన్. ఆహా ఓటీటీలో వీక్షించొచ్చు.

వైఫ్ ఆఫ్

ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం ‘వైఫ్ ఆఫ్’ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఈ సినిమా జనవరి 23వ తేదీన ఈవీటీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. భర్త చేతిలో వేధింపులు ఎదుర్కొని.. తిరగబడిన ఓ అమ్మాయి చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.

వైఫ్ ఆఫ్ చిత్రంలో దివ్య శ్రీ ప్రధాన పాత్ర పోషించారు. అభినవ్ మణికంఠ, నిఖిల్ గాజుల, సాయి శ్వేత, వీర్ మనోహర్ కావలి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి భాను దర్శకత్వం వహించగా.. ప్రణీత్ సంగీతం అందించారు. రాహుల్ తమద, సందీప్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్‍లో ఈ గురువారం జనవరి 23 నుంచి చూడొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం