వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి ఈ జూన్ మూడో వారం కూడా చాలా చిత్రాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. వీటిలో ఐదు చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా కనిపిస్తున్నాయి. ఓ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు ఈవారమే రెడీ అయింది. ఉగ్రవాదులను మట్టుబెట్టడం చుట్టూ సాగే మరో చిత్రం కూడా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. రెండు మలయాళ చిత్రాలు తెలుగులో రానున్నాయి. ఈ వారం ఓటీటీల్లో టాప్ 5 రిలీజ్‍లు ఇవే..
దిల్జీత్ దోసంజ్ ప్రధాన పాత్ర పోషించిన డిటెక్టివ్ షెర్దిల్ చిత్రం జూన్ 20న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. థియేటర్లలో రాకుండా నేరుగా ఓటీటీలోకే ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం సాగుతుంది. ఈ సినిమాకు రవి చబ్రియా దర్శకత్వం వహించారు. డిటెక్టివ్ షెర్దిల్ మూవీలో దిల్జీత్‍తో పాటు బొమన్ ఇరానీ, చంకీ పాండే, రత్న పాఠక్ షా కీలకపాత్రలు పోషించారు. జూన్ 20 నుంచి ఈ మూవీని జీ5లో చూసేయవచ్చు.
బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం గ్రౌండ్ జీరో ఈవారమే ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. జూన్ 20వ తేదీన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సాధారణ స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే రెంటల్ విధానంలో ఈ చిత్రం వచ్చింది. అయితే, రెంట్ తొలగిపోయి జూన్ 20 నుంచి ప్రైమ్ వీడియోలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంటుంది. ఈ మూవీలో ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్ర పోషించారు. బీఎస్ఎఫ్ ఆఫీసర్ నరేంద్ర నాథ్ ధార్ దూబే నిజజీవిత ఘటనల ఆధారంగా, ఉగ్రవాదులను మట్టుబెట్టే మిషన్ చుట్టూ ఈ చిత్రం ఉంటుంది. తేజస్ ప్రభ విజయ్ దేవ్‍స్కర్ దర్శకత్వం వహించిన గ్రౌండ్ జీరో మూవీ ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైంది.
'కొల్లా' సినిమా తెలుగు వెర్షన్ జూన్ 19వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో అడుగుపెట్టనుంది. థియేటర్లలో మలయాళంలో 2023 జూన్‍లో ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. రెండేళ్ల తర్వాత తెలుగు డబ్బింగ్ అయి ఇప్పుడు ఈటీవీ విన్‍లోకి వస్తోంది. ఈ హీస్ట్ థ్రిల్లర్ చిత్రంలో రజిషా విజయన్, ప్రియా ప్రకాశ్ వారియర్, వినయ్ ఫోర్ట్ లీడ్ రోల్స్ చేశారు. ఇద్దరు అమ్మాయిలు బ్యాంకు దోపిడీ చేయడం, పోలీసుల దర్యాప్తు చుట్టూ కొల్లా సినిమా కథ సాగుతుంది.
తెలుగు లీగల్ థ్రిల్లర్ చిత్రం ‘ఒక పథకం ప్రకారం’ జూన్ 20న సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు శ్రీరామ్ శంకర్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి వినోద్ విజయన్ డైరెక్షన్ చేశారు.
నెస్లెన్ గఫూర్ ప్రధాన పాత్ర పోషించిన మలయాళ మూవీ అలప్పుజ జింఖానా.. తెలుగులో మరో ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ జూన్ 20న ఆహా ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ స్పోర్ట్స్ కామెడీ డ్రామా చిత్రం ఇటీవలే సోనీలివ్ ఓటీటీలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ జూన్ 20న తెలుగు వెర్షన్ రానుంది. ఖాలీద్ రహమాన్ దర్శకత్వం వహించిన అలప్పుజ జింఖానా ఈ ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజై బ్లాక్‍బస్టర్ సాధించింది.
సంబంధిత కథనం